పుట:ASHOKUDU.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆఱవ ప్రకరణము

18

ముగా బాలిక నవయౌవనవతి యయ్యెను. క్రమముగా యువతియయ్యెను. ఆమె రూపలావణ్యములు శుక్లపక్ష చంద్ర కళలవలె దిన దిన ప్రవర్ధమానములు కాఁజొచ్చెను. వానితో గూడ నా మెసపత్నీగణముల యీర్ష్యా ద్వేషములును వర్ధిల్లసాగెను. అప్పుడు వారందఱును మిగులఁ గౌశలముతో సుభద్రాంగి మహా రాజుకంటఁ బడకుండునట్టి ప్రయత్నములను జేయ నారంభించిరి.

పరమేశ్వరుని యజ్ఞాతనియమవశంబున మనుష్య హృదయములయందు విస్మృతి యుదయించు చుండును. ఈ నియమము చేతనే యొకప్పుడు సార్వభౌముఁ డగు దుష్యంతుఁడు శకుంతలను మఱచిపోయెను. మహారాజగు బిందుసారుఁడుకూడ నీ నియమమున కతీతుఁడై యుండ లేదు, అంతఃపుర వధూజనముల చాతుర్యమువలనను విస్మృతి' వశమునను బిందుసారుఁడు సుభద్రాంగి మాటయే మఱచిపోయెను. సుభద్రాంగిమాత్రము నిశ్చింతురాలైయుండ లేదు.

ప్రపంచమునందలి జనుల కందఱకును శత్రులును మిత్రులుఁగూడ నుందురు. సుభద్రసవతు లామె రూప లావణ్యములంగాంచి యీర్ష్యా పరవశలై శత్రుత్వమును జూపుచున్న మాట సత్యమే--కాని యంతఃపుర పరిచారికలలోఁ జాలమంది యా సుభద్రాంగితో మైత్రి నెఱుపుచు

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/27&oldid=333022" నుండి వెలికితీశారు