పుట:ASHOKUDU.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

అ శో కు డు

మహా వైభవముననుభవించుచు సుఖపడఁగలదను నాలోచనతో మరలఁ జంపక నగరమునకుఁ బ్రయాణమయ్యెను, సుభద్రాంగి యప్పటినుండి పితృగృహస్మృతి, కల్పనములు, కథలు మొదలగు వానిమూలమున సంతుష్టి' నందుచు 'రాజాంతఃపురమునందుండి తల్లిదండ్రులకించుక యూరటను గల్పించుచుండెను.

ఎక్కడీదరిద్రకుటీరము! ఎక్కడి రాజాంతఃపురము!!! చిన్ని గొరవంకను గులాయమునుండి విడఁ దీసిశోభనప్రమోదో ద్యానమందిరమున విశాలకనక పంజరమునందు బంధించినచో దానిమనో భావ మెట్లుండునో, సుభద్రాంగినోమభావముకూడ జాలవఱ కట్లేయుండెను. సుభద్రాంగి పుట్టిన యింటిముంగిటి వాకిలిచిన్నదియే- కానియదియా మెచిన్ని పాదములకును,లీలా తరళ నయన యుగళంబునకును బరిమిత స్థానమై యుండ లేదు, దానికిమారుగా నిప్పుడా బాలికకుఁ బ్రాకార వేష్టిత ప్రాసాదములును విశాల సరోవరంబులును, జలయంత్రములును, పుష్పలతా మనోహరవిశాల ప్రాంగణములును లభియించి యున్నవి. కాని, యివియన్నియు నామె కూపిరి త్రిప్పుకొనుటకైన నవకాశము లేనంతటి పరిమిత స్థలములుగనే తోఁచుచుండెను. మానవప్రకృతులయెడల సహవాస ప్రభావ మనంతమైనది—క్రమముగ నా బాలికకు రాజాంతఃపురము నందలి దృశ్యము లన్ని టితోడను బరిచయమయ్యెను. అప్పుడామె చంచలహృదయము సుస్థిరమైన దయ్యెను. ఈ విధ

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/26&oldid=333021" నుండి వెలికితీశారు