పుట:ASHOKUDU.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

అ శో కుఁ డు

“నిగమమంత్రార్థ సిద్ధి నీ | కగునుగాక !
అఖిలశత్రు వినాశన | మగునుగాక !
ఆ పబుధుమిత్రులకు మే | లగునుగాక !
ధనము, ధ్యానంబు, ధర్మంబు | ధరణితలము
చిరతరాయుష్యము, సుఖంబు, | వరయశంబు,
వారణతురంగయానాది | వైభవంబు
భాసురాపత్యసిద్ధి, సు | శ్రీసమృద్ధి,
అభిమతార్ధోపలబ్ధి నీ | కగునుగాక ! "

సార్వభౌముఁడగుబిందుసారుని యమూల్యమణిమయ కిరీటాలంకృతం బగునుత్తనూంగ మాదరిద్ర బ్రాహ్మణుని యాశీర్వాదపరిగ్రహణమునకై యించుక యవనతమయ్యెను, రాజాజ్ఞానుసారముగ నప్పు డాబ్రాహ్మణుఁడు "రాజపరమేశ్వరా ! నాకొకకన్యారత్న మున్నది. ఆమె పరమరూప లావణ్యవతి; సకలశుభలక్షణ సమన్విత - ఎందఱో దైవజ్ఞులీ మెరాజమహీషియగునని వాక్రుచ్చియున్నారు. మహా రాజా నేనీకన్యకు జనకుఁడను. ప్రేమవశమున నాశా లుబ్ధుడనై దేవరకు శరణాగతుఁడ నైతిని. ప్రభూ ! అనుగ్రహముంచి మా కన్యను బరిగ్రహింపవలయును. ఇదియే యీదరిద్ర బ్రాహ్మణుని వినయపూర్వక విజ్ఞాపనము” అనియెను.

చక్రవర్తియగు బిందుసారుఁడు : “స్త్రీ రత్నందుష్కలాదపి ” అను వాక్యమును స్మృతికిఁ దెచ్చుకొని యాకన్య

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/24&oldid=333019" నుండి వెలికితీశారు