పుట:ASHOKUDU.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయిదవ ప్రకరణము

15

జూడఁగలిగెను. ఆ బ్రాహ్మణుఁడు గ్రంథములలో నింద్రసభా వర్ణనమును వినియుండెను. ఇప్పు డాతఁ డిఁ ద్రసభలోఁ బ్రవేశించితినని యనుకొనియెను. మహా రాజమణియగు బిందుసారుఁడు మయూర సింహాసనమున నధివసించియుండెను. అమాత్యు లమరులం బోలియయ్యాస్థానము నలంకరించి యుండిరి. ఇంద్ర చంద్ర వాయువరుణ ప్రముఖు లెల్లరు నాతనికొక్కచో నగపడుచున్నట్లుండెను. ఎవ్వరిని వదలి యెవ్వరిని జూడవలయునో యాతనికి బోధపడుట లేదు. ఎవ్వరినైనఁ దదేక దృష్టితో వింతగఁ జూచుచుండినచో నసబ్య జనో చితముగ నుండు నేమో యని యాతఁడు సంకోచించుచుండెను. అప్పుడా తఁడాశాదృష్టులతో మంత్రి యెచ్చటనుండెనో కను పెట్టవలయుననియు, నాతనికిఁ దన్ను గాన్పించుకొనవలయుననియు నలు దెసలఁ బరికించుచుండెను. పిమ్మట నాతఁడు మంత్రి చేసన్న చే నించుక స్వస్థచిత్తుఁ డై కూర్చుండియుండెను.

దైనిక రాజ కార్యములు పూర్తయిన తరువాత రాజాజ్ఞ చేమనవులఁ దెఱుపుకొనవలసినవా రొక్క రొక్కరుగమహారాజ సముఖమునకుఁ బోయి తమతమ ప్రార్థనములం దెలుపుకొని వెడలిపోవుచుండిరి. తుదకుఁ జంపక నగర బ్రాహ్మణుఁడు కూడ రాజసమీపమునకుఁ బోయి నిలువబడియెను. బ్రాహ్మణుఁడు యథావిధిగా సార్వభౌము నభినందించి, ధాన్యమును దూర్వా కురములను నోసంగి యీ విధముగ నాశీర్వదించెను.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/23&oldid=333018" నుండి వెలికితీశారు