పుట:ASHOKUDU.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆఱవ ప్రకరణము

17

నంతఃపురమునకుఁ బంపవలయునని యాజ్ఞాపించెను. మంత్రి యగు రాధాగుప్తుఁడు రాజాజ్ఞను యధావిధిగఁ బ్రతి పాలించెను.

దరిద్ర బ్రాహ్మణు, రాజసందర్శన మీవిధముగా ఫలియించెను.


ఆఱవ ప్రకరణము

రాజాంతఃపురము.

బ్రాహ్మణుఁడు రాజాస్థానమునుండి తిరిగివచ్చి సుభద్రకు సమస్త వృత్తాంతమును దెలియఁ జేసెను. భవిష్యత్సుఖ చిత్రమతిమనోహర మైన దేయైనను జిర కాలము వఱకుఁ దండ్రి తనయను విడిచి యుండుటయును, బాలిక తల్లిదండ్రులను విడిచియుండుటయుఁ దటస్థించుటవలన నది విచారకరము గ నేయుం డెను. కన్నీరు భవిష్యత్సుఖ ప్రదర్శనమును దూరము నందుంచిన నుంచుఁగాక ! వ వర్తమానమునందైన నొండొరులు పరస్పరముఁ జూచుకొనకుండ నామార్గమున కడ్డము వచ్చి నిలిచినది !! కొంత సే పీవిధముగఁ గడచిపోయినది. పిమ్మట నియమిత సమయమున వాహనాదిక వైభవములతో సుభద్రాంగి రాజాంతఃపురమునకుఁ దీసికొనిపోఁబడియెను.

అనంతర మా బ్రాహణుఁడు పాటలీపుత్రమునఁ గొన్ని దినములుమాత్ర ముండి శూన్య హ్రుదయుఁడై తన ముద్దుబిడ్డ

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/25&oldid=333020" నుండి వెలికితీశారు