పుట:ASHOKUDU.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పది యొకటవ ప్రకరణము

131

మహారాజగు నశోకునకు రాణులు చాలమంది యుండిరి. అందఱలోనను "తిష్యరక్షిత" యను రాణీ యాతని జీవితమునందలి నానా దుఃఖములకును గారణ భూతురా లయ్యెను. ఆమె తంత్రమువలన నే యవరాజగు కుణాలుఁడంధుఁడయ్యెను. తిష్యరక్షిత కుటిల హృదయము, దుశ్చరిత్రయునై యుండెను. రాజాంతఃపురము నిట్టి కాల సర్పిడియు, రాజ్యమున కిట్టి యంధుఁడగు భావిమహా రాజును దటస్థించుట చే నప్పటి యాతని హృదయభావ మెట్లుండునో యూహించుకొన్నచో సులభముగ నే బోధపడఁగలదు ! ఇట్టి సమయమునందే యాతని ప్రియసహోదరుఁడగు వీతాశోకుఁడు కాలవశము చే నోక యాభీరుని చేతులలోఁబడి మర ణించెను. ఇట్టి యని వార్యసంఘటనములచే మహా రాజగు నశోకుఁడు విషణ్ణు డైఁపోయెను. అందుచే నాతనికి సంసారమున విరక్తి కలిగెను. అంతటినుండి యాతఁడు రాజర్షి వలె సంసార బంధమును ద్రెంచుకోని, కాలయాపనము గావించు చుండెను. కుణాలు నియ భావనీదుర్దశ చే నాతని పౌత్రుఁడగు సంపాది రాజ్యమునకు యువ రాజయ్యెను. అప్పుడు ప్రియదర్శియగు నశోకుఁడు నామమాత్రమున రాజై యుండెను. యువరాజగు సంపాది మంత్రి మొదలగు రాజోద్యోగుల పైఁ దన యధికారముం జూపుచు రాజ్యమంతయుఁ దా నే పాలించు చుండెను. అశోకమహా రాజు ధర్మచింతచే ధర్మకర్మముల తోడను బుణ్య ప్రసంగములతోడను గాలక్షేపము చేసికొనుచుండెను.