పుట:ASHOKUDU.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

అ శో కుఁ డు

చరిత్రమును బఠించినచో నెంతయో పూర్వకాలమునందే మన భారతవర్షమునం దిట్టి సౌకర్యములు విశేషించి విధాయ కాచరణము నందుండె నని బోధపడఁగలదు--అప్పుడు మన హృదయము శ్రద్ధాప్రశంసావిస్మయపరిపూర్ణము కాఁగలదు!


ముప్పది యొకటవ ప్రకరణము


ఆత్మమంగళము

ప్రియదర్శనుఁడగు నశోకుఁడు తన విశాలరాజ్యము మునందలి శాంతికొఱకును, నందలియసంఖ్యాక ప్రజాగణహిత సాధనము కోఱకును, భగవాను డగుబుద్ధ దేవుని శాంతి మత ప్రచారముకొఱకును పశుపక్షి కీటాదిసర్వప్రాణి సంరక్షణముకొఱకును దన జీవితము నంతను వినియోగించి యథానుకూలములగు 'నే ర్పా టు ల ను గావించియుండెను.ఇట్టి సకలసత్కార్యములను శ్రద్ధతోఁ గావించుచున్న యాతతనికిఁ గ్రమముగ వార్ధక్యము తటస్థించెను. పరమేశ్వరుని విచిత్రవిధానములచే జీవిత కాలమునందలి సంధ్యాసమయము శాంతిమయయిగా నుండునదృష్ట మెవ్వరికో గాని లభింపదు. పుణ్యశ్లోకుఁ డగునశోకుఁడుకూడ నీకఠోర నియమము నతిక్రమింపఁ జాలక పోయెను,