పుట:ASHOKUDU.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియవ ప్రకరణము

127

యును మతప్రచారము గావించియుండిరి. మహారాజగు నశోకుఁ డెట్టి శ్రద్ధతోఁ బ్రయత్నించి బౌద్ధ మత ప్రచారమును గావించియుండెనో యట్టి పూనికతో భారతవర్షమునందేరాజును నెట్టిమతమును బ్రచారితము గావించి యుండ లేదు. మత పవిత్రతాసంరక్షణకొఱకు, మత ప్రచారముకొఱకు మత స్థిరత్వముకొఱకు సర్వవిధములఁ బ్రయత్నించుట చేఁ బ్రియ దర్శనుఁడగు నశోకునినామము సర్వజగచ్చరిత్రము నందును జిరసముజ్జ్వలితమై విలసిల్లుతున్నది.


ముప్పదియవ ప్రకరణము


భూత దయ

అహింసయే పరమధర్మమనుమాట యశోకుఁడు పుట్టుటకుబూర్వము చాలఁగాలము క్రిందటినుండియే భారత వర్షమునఁ బ్రచారమునం దున్నది. అయినను వేదసహిత యజ్ఞయాగాదుల యందును, దేవతామహోత్సవముల యందును లెక్క లేనన్ని జీవములు హింసింపఁబడుచు నే యుండెను. మానవభోజ నాదులయం దంతకంటెను నధికముగ జీవహింస లగుచుండెను. భగవానుఁడగు బుద్ధ దేవుఁడును, తీర్థష్కర మహా వీరాస్వామియును జేసిన యమోఘ