పుట:ASHOKUDU.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

అ శో కుఁ డు

జేయుటకై నానా దేశములకు బుద్దమత ప్రచారకులను బంపించు చుండెను. ఏయే దేశముల కెవ్వరెవ్వరు మత ప్రచారార్థము పంపఁబడిరో యా విషయ మీ క్రిందిపట్టికలో వివరింపబడి యున్నది;

(1) కాశ్మీరము, గాంధారము—మజ్ఞస్తికుఁడు.
(2) మహిషమండలము-- మహదేవుఁడు.
(3) వన వాసి—— రక్షితుఁడు.
(4) అపరాంత—— ధర్మరక్షితుఁడు,
(5) మహారాష్ట్ర—— మహాధర్మరక్షితుఁడు.
(6) యవనలోక (గ్రీసు)—— మహారక్షితుఁడు.
(7) హిమవంత—— మజ్ఞి మదురభి సారుఁడు, మహాదేవుఁడు, మాలవ దేవుఁడు.
(8) సువర్ణ భూమి——సేనుఁడు, ఉత్తరుఁడు.
(9) సింహళ—— మహేంద్రుడు; సంఘమిత్ర,

ఈ పట్టికం జూచినచో నశోక సార్వభౌముని ప్రభావ మెంతవఱకు వ్యాపించినదియుఁ దెలియగలడు. గాంధార(కాందహార) మప్పు డాతని రాజ్యమునకు జేరియుండెను.అంతదూరము నందున్న గాంధారమును గూడ నతిక్రమించి యాతని మత ప్రచారకులు యవన (గ్రీస్) దేశము గూడఁ బోయియుండిరి. మఱియు దక్షిణసముద్రమునుదాఁటి సింహళమున మహేఁద్రుఁడును, నాతని సోదరియగు సంఘమిత్ర