పుట:ASHOKUDU.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

అ శో కుఁ డు

ప్రయత్నములవలన నట్టి జీవహింసలు చాలవఱకుఁ దగ్గి పోయెను. అహింసయే పరమధర్మమనుమాట వారి మూలమున నే సర్వసామాన్యముగ నందఱకును బోధపడియెను, ఆ కాలమునుండి యే జీవహింస తగ్గుల కారంభ మయ్యెను. ఎట్టిజీవికైన నెట్టి యనిష్టము నైనఁ జేయకుండుట యహింస యనియు, సర్వజీవులను ప్రేమించుచు సర్వజీవులకును హిత సాధనములం గావించుట సర్వభూతదయయనియు సర్వ సాధారణముగఁ దెలిసిపోయెను.

మహా రాజగు నశోకుఁడు సర్వభూతముల క్షేమము కొఱకును గావించిన యేర్పాటులను గూర్చి పఠియించినచో “అహింస ” “భూతదయ” అను వాని విభేదము స్పష్టముగ బోధపడ గలదు ప్రజారంజనము చేయు వాఁడే రాజు, ప్రజా రంజనము చేయుటయే రాజ్యత్వమునకు ముఖ్యోద్దేశము. ఈ పద్దతియం దశోక సార్వభౌముఁడు సర్వవిధముల నాదర్శప్రభుఁ డై యుండెను. ప్రజారంజనమునకై యాతఁడు చేయని కార్య మేదియును లేదు. ప్రజా రంజనము చేయుట మాత్రముచే నాతఁడు నిశ్చింతుఁడై యుండ లేదు. అతని ప్రేమామృత పవిత్రప్రవాహము పశుపక్షి కీటపతంగ పర్యంతమును ప్రవహించి యుండెను; అవికూడ నాతని ప్రేమ రాజ్యమునఁ బ్రజ లేమైయుండెను ! వానిని రక్షించుటయు, రంజించుటయు గూడ నవశ్యక ర్తవ్యమే యని యాలోచించి ప్రేమాశోక