పుట:ASHOKUDU.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

అ శో కుఁ డు

ప్రత్యేక ప్రదేశములయం దొక్కొక్క రాజప్రతినిధి శాసించుచుండెను. రాజకుమారులుగాని రాజబంధులుగాని, యోగ్య పురుషులుగాని యాయా ప్రదేశముల శాసనకర్త లగు చుండిరి.

ప్రాదేశిక శాసన కర్తల యధీనమున నొకయధికారి యుండి యిట్టి కార్యములఁ జేయుచుండు. ఆయుద్యోగ మిప్పటి కమీషనరుల యుద్యోగమువంటిది. ఆయుద్యోగి కి రాజూకుఁడని పేరు-అట్టి రాజూకుని చేతి క్రింద “ప్రాదేశికుఁడు” కార్యముల నిర్వహించుచుండును. ఆయుద్యోగ మిప్పటి జిల్లా మేజస్టేటు పదవివంటిది. ప్రాదేశికుల క్రింద “యుక్తుఁడు ” “ఉపయుక్తుఁడు” అనునుద్యోగులుందురు. మిగిలిన యుద్యోగులు యథా యోగ్యముగ లెక్కలవిషయమునను గచేరి వ్యవహారములయందును నియోగింపఁ బడుచుందురు. అప్పటి చిల్లరయుద్యోగులకు లేఖకులని పేరు. రాజధానియందలి యెల్ల లెక్కలను దెలియఁబరచుట కిప్పటి “ సెక్రటరీయేట్" వలె నొక గొప్పకచేరి యున్నది.

“రాజాన శ్చార చక్షుషః" అనుమాట మన దేశమున మిగులవాడుకలో నున్నది. అట్టిగు ప్తచారు లశోకుని రాజ్యము నందుఁగూడ నున్నారు. అందుఁ బ్రథాన గూఢచారులకు "ప్రతి వేదకు” లని పేరు. వారెల్లప్పుడును జండి కాలయము మొదలు వేశ్యాలయము వఱకును గుప్తచరులై యుందురు.