పుట:ASHOKUDU.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది యెనిమిదవ ప్రకరణము

123

ఉన్నత స్థితి యందున్న వేశ్యాగణముకూడ వార్తాసంగ్రహణమునఁ బస చేయుచుండెను. రాజ్యశాసనము కొఱకును, రాజునకును, రాజ్యమునకును విపక్షులగు వారిని నిగ్రహించుటకును, ప్రజాధర్మమును నీతిని బరి పాలించుచు వారియున్నతికిఁ దగుపద్ధతుల నాలో చించుటకును దగినక ట్టుదిట్టములు చేయఁబడి యుండెను. క్రీస్తు రాజ్యమునం దస్యా న్యవిభాగములనడుమ మత మొక్కరీతి నే యెట్లు వ్యాపించియున్నదియో యశోకుని రాజ్యమునందుఁగూడ నట్లే వ్యాపించి యుండెను. ఇట్టి మతవిభాగ కార్యములను గూర్చి తెలిసికొనఁదలఁచినచో “ధర్మ మహామాత్రు” డను పేరుగల మత ప్రవర్తకుని యుల్లే ఖనములను జదువవలయును.

మహా రాజగు ధర్మాశోకుని రాజ్యమున యుద్ధ విగ్రహములు లేవు. కాని యాతని సైన్య విభాగము మాత్ర మతి ప్రజల మైయుండెను. ఆతఁడు నగర శాసన విషయంబునం జేసిన యుద్యోగ విభాగమువ లెనే సైన్యశాసన విషయంబునఁ గూడ నాఱు శాఖలుగా విభజించెను. అతని బలవిభాగమున నౌకాసేన, పదాతిసేన, అశ్వసేన, రథసేన, గజసేన మొదలగు నాఱు శాఖలు కలవు. వీనిమూలమున రణసామగ్రులను బంపుట, రససంగ్రహణము, వస్తుసంచయ ప్రేషణము 'మొదలగు కార్యములు నిర్వహింపఁబడుచుం డెను. రాజ్యమునందలి యంతర్విద్రోహముల నడఁగించుట కేమి, బహిశ్శత్రువులా