పుట:ASHOKUDU.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది యెనిమిదవ ప్రకరణము

121

చుచుండిరి. అశోకుడు తన యైహికాముష్మిక సుఖాభివృద్ధికై కావలసిన కార్యముల నన్నిటిని సంపూర్ణముగఁ గావించెను. ఆతఁడు రాజనామము నకుఁ దగియుండెను. ప్రజారంజనమే యాతని పరమధర్మము. ఆతఁడు ప్రజలను బిడ్డలవలెఁ బాలించుచుండెను. ఇట్టి సద్గుణములచే నశోకుఁడు రఘు మహారాజుతో సమానుఁడని చెప్పుట కెంతయుఁ దగి యుండెను.

‘‘సపితాపితరసాం కేవలం జన్మ హేతవః "

ప్రజావత్సలుఁ డగుప్రభువే ధన్యుఁడు. అట్టి రాజు చేఁ బరిపాలింపఁబడు దేశమే పుణ్యమయమైనది. అట్టి రాజును సేవించుచు నాతని దేశమున వసియించుచున్న ప్రజలు సౌభాగ్యమే భాగ్యము.


ఇరువది యెనిమిదవ ప్రకరణము


శాసన ప్రణాళి

అశోక సార్వభౌముని శాసన ప్రణాళిక యతిసుందరమైనది. అతని విశాలసామ్రాజ్యమున వివిధ ప్రదేశముల యందు వివిధరీతుల శాసనము లు పయోగపడుచుండెను.