పుట:ASHOKUDU.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియాఱవ ప్రకరణము

115

సాహాయ్యము లభియించుచుండెను. వారే పరివ్రాజకులు, పరివ్రాజకులు సంవత్సరమున కెనిమిదిమాసములు గ్రామ గ్రామమునకును నగర నగరమునకును దిరుగుచుండెడివారు; ఆయా స్థానముల యందు విజ్ఞాన ప్రపూర్ణంబులగు నుప దేశములఁ జేయు చుండెడి వారు. వీరి శిక్షా పద్ధతులయం దోక విశేషమున్నది. వీరు ముందుగఁ దమ్ము దర్శీంచిన వారితో సంభాషించుట కారంభింతురు. పిమ్మట నే దేనోక విషయముం దీసికొని యందలి తత్త్వమును విస్పష్టముగఁ బ్రబోధించు చుందురు. ఇందువలన జన సాధారణమునకంతకును విజ్ఞాన లాభము కలుగుచుండెను. జనసంఘమున జ్ఞానము విస్తరిల్లు చుండెను. పరివ్రాజగులయందుఁ బ్రజలందఱును విశేషముగ భక్తిశ్రద్ధలు కలిగి యుండిరి. ఇట్టి వారు నివసించుటకును బ్రజ లకు బోధించుటకు ను ధనికులగువారు గ్రామములయందును నగరములయందును బ్రశాంతమంటపములను గట్టించియుండిరి. ఇట్టి మంటపములను గట్టించుట మిగులఁ బుణ్యమనియు, ధర్మమనియఁ బ్రతిష్టాకరమనియు నప్పటివాడు తలంచుచుండిరి. శ్రావ స్తీనగరమున రాణియగు మల్లి కచేఁ బ్రతిష్టిఁపఁబడిన మంటప మిట్టి పరివ్రాజక ల యుపయోగము కోఱకే యుపయోగింపఁబడియెను. వైశాలినీ నగరోపకంఠమునం గల సుప్రసిద్ధంబును, మనోహరంబును నగుచంపక వనమిట్టి పరివ్రాజక గణంబుల కొఱకే ప్రతిష్ఠిఁపఁబడియెను.

పరివ్రాజక సంప్రదాయమున స్త్రీలు గూడ లోక శిక్షణమున కు సాహాయ్యపడుచుండిరి. పరివ్రాజకలును, బరి వ్రాడ