పుట:ASHOKUDU.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

అ శో కుఁ డు

కులు నిప్పటి సన్యాసినీ సన్యాసులంబోలెఁ గఠోరవ్రతపరాయణులు గాక పోయినను వారు చిర కాలమువఱకును బ్రహ్మచర్య వ్రతమును స్వీకరించుచుండిరి. విజ్ఞానమయంబులగు వీరియుప దేశములను గ్రహించులకు గ్రామగ్రామముల యందు ననేక సభలు గావింపబడుఛ్హుండెను. ఆ సభలకు బ్రాహ్మణ పండితులును బరివ్రాజకులును గూడఁ బిలువఁబడు చుండిరి. సభయందలి యుపన్యాసములు ముగిసిన తరువాత సమాగతులగు ప్రజల యుపయోగము కొఱకు నానాశాస్త్ర చర్చలు జరుగుచుండెను. పెద్ద పెద్ద పల్లెలలో నిట్టి సభలు విశేషముగ జరుగుచుండెను. పరివ్రాజకు లట్టి చోటికిఁ దఱచుగ వచ్చుచుఁ బోవుచుండిరి. బౌద్ధ భారతేతి హాసమునుబట్టి యాలోచింపఁగా నా కాలమున గ్రామోప కంఠములను,"రాజపథ పార్శ్వములను, బుణ్య క్షేత్రములను నివసించుటకుఁ బరివ్రాజకులకును, సాధువులకును, సన్యాసులకును దగిన ప్రశాంతములగు గృహములును మంటపములును నిర్మింపఁ బడియున్నట్లు స్పష్టపడుచున్నది. ఇందువలన జనసామాన్య మునకంతకును జ్ఞానాసక్తి, మత ప్రవృత్తి, సాధుభక్తి మొదలగునవి యుత్తరోత్తరాభివృద్ధి నందుట కవకాశము కలిగి యుండెను. ఈ కారణములఁబట్టి యా కాలపుఁ బ్రజలు క్షేమముగా నుండిరనియు, విద్యావంతులై యుండిర నియుఁ జెప్పుట కెంత మాత్రమును సందేహము లేదు.