పుట:ASHOKUDU.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

అ శో కుఁ డు

దుండెనని చెప్పుట కెంతమాత్రమును సందేహము లేదు. సకల దేశములయందును సకల సమయములందును విశేష జనపదములలో విద్యాశిక్షణ విషయమున సుప్రసిద్ధము లై యుండు స్థానములు కొన్ని మాత్రమెయుండును. ఇంగ్లాండునకు లండను ప్రధాన నగర మేయైనను నదీ విద్యావిషయమున మాత్రము ప్రసిద్ధమైనది కాదు; ఆక్సుఫర్డు, కేంబ్రిడ్జి యనునవి విద్యా విషయమునఁ బ్రధానములు. భారతవర్ష మునం దిప్పటికిని వారణాసి, పూనా, నవద్వీపము మొదలగు స్థానములు సంస్రృత విద్యాశిక్షకుఁ బ్రసిద్ధములై యున్నవి. అశోకుని కాలమున రాజగృహ సమిపమునందున్న నలాందాయును, బశ్చిమోత్తర భాగమునందున్న తక్షశిలయును విద్యాస్థానములందుఁ బ్రధానము లై యుండెను. అశోకమహా రాజు నలం దాయందు విద్యార్థుల కుపయోగముగానుండుకొఱ కనేక గృహములను గట్టించియి చ్చెను. అందు విద్యార్థుల పోషణమునకుఁ దగిన యుపపత్తులను సమృద్ధములుగ సమకూర్చియుంచెను. అశోకుఁడు స్వయముగ విద్యాపోషణ కార్యములయందు సము త్సాహియైయుండెను. అతని రాజ్యమున విద్యలకును, విద్వాంసులకును బరమాదరమున్నదని చెప్పుచున్నప్పుడు విద్యార్ధులకు విద్యాలాభము సర్వసులభముగ నుండెనని చెప్పుటలో వింత యేమున్నది ?

శ్రమణులను భిక్షువులు నే కాక మఱి యొక తరగతి వారివలనఁగూడ నా కాలమున లోకశిక్షావిషయమున విశేష