పుట:ASHOKUDU.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

అ శో కుఁ డు

వురకు నించుక సంభాషణ మైన తరువాత 'దైవజ్ఞుఁడు “అయ్యా! మీరు విచారముతో నున్నట్లగ పడుచున్నారేమి? " అని ప్రశ్నించెను.

గృహ:- అందుల కాశ్చర్యమేమున్నది? వయసు వచ్చినబిడ్డ యింకను బెండ్లి గాకుఁడ నింట నున్నప్పుడేజనకుఁడు నిశ్చింతుఁడై యుండఁగలుగును? నేను దరిద్రుఁడను—— నా కుమారైకుఁ దగిన యనుకూలవరుని నేనెట్లు తేఁగలుగుదును? రేయుంబవ లీవిషయమును గూర్చి యే యాలోచించుకొనుచు నిట్లుంటిని.

దైవ:-- అగునామాటనిజమే. రాజులును, మహారాజులును, ధనికులును, గొప్పవారందఱునుగూడఁ దమ కుమార్తెల ననుకూలవరులకుంగూర్చి కన్యాదాన ఫలము నందవలయు ననియే యపేక్షించుచుందురు. కాకేమి? మీరెఱింగియే యుందురు——జననమరణ వివాహములు మూడును దై వాధీనములు ! వివాహ విషయమునఁ గన్యకయదృష్టమే ప్రధాన మైనది.

గృహ:- అవును. అవి దైవాధీనములే. ఎఱుఁగుదును. కాని, ప్రయత్నముకూడ నావశ్యక మే కదా!

దైవ:-సర్వవిషయములయందును గూడ దైవ పురుష కారములు రెండు నావశ్యకములే. ఈమాట నెన్వఁడు కాదనఁగలఁడు? కాని యదృష్టముమాత్రము పేక్షుణీయము

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/12&oldid=332999" నుండి వెలికితీశారు