పుట:ASHOKUDU.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాదు. ఏమైన నేమి? మీకొక్కమాట చెప్పెదను—— మీరు కుమార్తె వివాహ విషయమున నెంత మాత్రమును జింతింప నక్కఱ లేదు.

ఇంతవఱకు వారిరువురును నిలిచియుండియే సంభాషించుచుండిరి. 'దైవజ్ఞుఁ డిట్లు చెప్పినతోడనే గృహస్థుఁ డానందించి యాతనిం దనతోఁ గూడ లోనికిందీసికొనిపోయి యొక చాఁపపైఁ కూర్చుండఁ జేసెను.

ఇరువురును గూరుచుండిరి. పిమ్మట దైవజ్ఞుఁడు “మీ బాలికను నొకసారి పిలువుఁడు” అనియెను.

గృహ:- అమ్మా సుభద్రాంగీ ! ఇటురమ్ము.

బాలిక యచ్చటకు వచ్చి తండ్రి యానతిచే దైవజ్ఞునకు నమస్కరించి యచ్చటఁ గూరుచుండెను.

దైవ:— అమ్మా ! నీచేయొక సారి చూపుము !

బాలిక యించుక సిగ్గుతోఁ దనవామహస్తమును జాఁచెను——చందనమలఁదిన చెక్కులును, దుమ్మెదలం గేరు పెన్నెఱులును, సిగ్గుమను దొంతరలం దరళంబులగు చెలు వంపుఁజూపులును నా బాలిక సౌందర్యమునకు మనోహరత్వము నాపాదించుచుండెను. కోమలారుణ పల్లవ సదృశంబులగు మృదుల హస్తములును, జంపక కోరక సన్నిభంబు లగురుచి రాంగుళులును నామె యదృష్టమును జెప్పకయె చెప్పుచున్నవి. ఇక ఫలా ఫలముల విశదీకరించుటకు దైవజ్ఞుఁడేల

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/13&oldid=333000" నుండి వెలికితీశారు