పుట:ASHOKUDU.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

కావలయును. ఆ బాలికను జూచినతోడనే పరమేశ్వరుఁ డేదియో విశేషోద్దేశముతో నీమెను సృష్టించి యుండునని బోధపడుచుండెను.

దైవజ్ఞుఁ డా బాలికహస్తమును బరీక్షించెను. ఆమె జన్మదినము, సమయము, లగ్నము మొదలగునవి తెలిసికొని గణనము చేసిచూసెను. పిమ్మట “అమ్మా! ఇఁక వెళ్లుము!" అనియెను.

ఒక్క గంతులో నా బాలిక తల్లి యొద్దకుఁ బోయెను.

దైవజ్ఞుఁ డా బాలిక శుభలక్షణము లంగూర్చి తండ్రికి విశదీకరించెను. మఱియునీ బాలిక గర్భమునం దిరువురు పుత్రులు జనియింతురనియు నఁదొకఁ డీవిశాలభూమండలమునకుఁ బ్రభుడగుననియు, రెండవ వాఁ డతిలోకప్రతి భానిధి యగు ధర్మమత బోధకుండగు ననియు గణించి చెప్పెను. ఆ బాలిక శుభలక్షణ ప్రశఁసయు, భవిష్యదైశ్వర్యప్రస్తావమును విని యామె తల్లిదండ్రులు మిగుల నానందించిరి. అప్పుడొక్కి ంచుక సేపా బ్రాహ్మణుడు తన పేద తనమును మఱచి పోయెను. అప్పుడాతని గృహిణి యా దైవజ్ఞునకు " ఈ దినమున మాయింటనే యాతిథ్యమును స్వీకరింపవలయును” అని తెలియ జేసెను.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/14&oldid=333001" నుండి వెలికితీశారు