పుట:ASHOKUDU.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియాఱవ ప్రకరణము

109

సౌకర్యము లుండెను. వర్తకుల వర్తక వస్తువుల వెలల ననుసరించి సుంకములు నిర్ణయింపఁబడుచుండెను. ఈ కార్యము లన్నియు విశ్వాసముగల సమర్థుఁ డగునుద్యోగివలన నెఱవేర్పఁబడుచుండెను. వర్తమాన కాలమున రేవులయందును నితరస్థలములయందును వర్తకపు సరకుల పై విధింపఁబడుచుండు సుంకము పూర్వకాలమునకంటె నధికముగా నున్నది. రాజ్యాభ్యుదయమున కిది యొక కిది యొక ప్రథానోపాయము గా నుండెను. కాని యా కాలమున వ్యవసాయమును, వాణిజ్యమును నింతవిస్తారముగ లేక పోయినను మహా రాజగు నశోకుఁడు వ్యవ సాయవర్తకముల కొఱకుఁ జేసిన సదుపాయములంగూర్చి యింతకాలమునకుఁ దరువాత వినినప్పుడు ప్రేమమూర్తి యగునశోకుని యుదార హృదయముం గూర్చి యెల్లరు నేక గ్రీవముగఁ బ్రశంసింపవలసి యున్నది.

శిల్పము—— అశోకుని రాజ్య కాలమున భారత వర్షము నందంతటను శిల్పవిషయమున విశేషాదరము కలదు. మౌర్యకుల తిలకుండగు నశోకుని రాజధానిని రాజప్రాసాద భగ్నావ శేషములను జూచి చీనా దేశ పరివ్రాజకుఁ డగు ఫాహియాను తనమనంబున నీ నగరమును, నీ రాజప్రాసాదమును మానవ నిర్మితము లే యగునా యని యాశ్చర్యపడియెను. కోటగోడలమీఁది చంద్ర శిలాఫలకముల పై నా కాలపు జనుల దైనిక జీవనోత్సవములను, యాత్రాస్థల విశేషములను గూర్చిన చిత్రములను జూచి ఫాహి