పుట:ASHOKUDU.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

అ శో కుఁ డు

యాను ముగ్ధుఁ డై పొయెను. రాజసభామంటపమునందలి దారు స్తంభములపై స్వర్ణ రౌప్యరసరంజితంబులగు దృశ్యములం గాంచి యాతఁ డెంతమాత్రమును వర్ణిఁపఁ జాలక పోయెను, శిల్పమునకుఁ జీనా దేశము సుప్రసిద్ధమైనది. అట్టి చీనా దేశము నందలి సుప్రసిద్ధ శిల్పరచనాని పుణుఁడగు ఫాహియాను వంటివాఁ డశోకుని కాలమునందలి శిల్పములంగాంచి యింత వింతపడుటం జూడఁగా నప్పటి మన వారి శిల్పరచనా ప్రావీణ్యమెంత యధికముగా నుండెడిదో బోధపడఁగలదు, అశోకుఁడు తన రాజ్య కాలమునఁ దన రాజధానియం దనేక స్థలముల యందు స్థూపములను స్తంభములను విశేషముగ స్థాపించియుండెను. వాని సంఖ్య యెనుబదినాలుగు వేలు; కాలసముద్ర తరంగములలో నవియన్నియు నిప్పుడెట్లు భగ్నములై పోయినవి ! కాని యిప్పటికిని భారతవర్షమున వివిధస్థలముల యందా స్థూప స్తంభ భగ్నావిశేషములు జలమగ్నంబు లగు నౌకావిశేషములవలె నగపడుచునే యున్నవి. భూపాలము నొద్ద నున్న సాంచిస్థూపమును గాశియొద్దనున్న సారానాథ స్థూపమును వీనిలో ముఖ్యము లైనవి. అశోకుని కాలమున శాశ్వతశిల్పరచనలు విశేషముగ నుండెడివి. పర్వతముల పై జెక్కఁబడినవియు, వివిధస్థలములయం దగపకు శిలాఖండములపైఁ జెక్కబడినవియు నగు శిల్పమూర్తులం జూచినచో నా కాలమున విశేషముగనున్న వివిధ శిల్పరచనా విశేష