పుట:ASHOKUDU.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

అ శో కుఁ డు

జిలుగువలువలు, సుగంధ ద్రవ్యములు, కస్తూరి, శిలాజిత్తు,గజదంతములు గజదంత నిర్మితములగు విచిత్రవస్తువులు, రత్నాభరణములు, వెండి, బంగారము మొదలగువస్తువులతో దేశ విదేశవ ర్తకమును జేయుచుండెడివారు. వ ర్తకులిట్టిలఘు భార వస్తువులను దీసికొని దేశాంతరములకుఁబోయి వర్తకము చేయుటవల్ల వారికి మిగుల సదుపాయముగనుండెను; ప్రయాణమునఁగష్ట ముం డెడిది కాదు. ఆవర్తకులు తఱచుగ గుంపులు గుంపులుగఁ బ్రయాణము చేయుచుండిరి. వారు సుప్రశస్త రాజమార్గమునువదలి పల్లెలకుఁ బోవలసి యున్నప్పుడు గ్రామస్థులు వారిని దమయూరికిఁ తీసికొనిపోయి నిరపాయస్థలమున నివసింపఁ జేయుచుండిరి. నిర్జనపథంబుల దూరముగఁబోవలసి నప్పుడును, రాత్రి కాలములఁ బ్రయాణము చేయవలసి నప్పుడును రాజభటులు వారికి రక్షకులై యొక చోటినుండి మఱియొక చోటికిఁ బంపుచుండిరి. ఇట్టి సదుపాయములకొఱకువర్తకులకు శుల్కము విధింపఁబడి యుండెను. ఈవిధముగా వర్తకులను నిర్జనపథములయందును, నెడారుల యందును, దుర్గమస్థానములయందును, రాత్రి కాలము లయ0దును, జోరాది బాధలనుండి రక్షించుకొఱకునుదగినంత మంది రక్షకభటులు నియమింపఁబడియుండిరి. అశోకరాజ్యమునం దంతటను వర్తకుల కిట్టియ నేక విధములగు సౌకర్యములుండెను. విదేశ వర్తకముకొఱకు జలమార్గములయందుఁగూడ నట్టి