పుట:ASHOKUDU.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియాఱవ ప్రకరణము

107

నేర్పాటు చేయఁబడియుండెను. మునుష్యజీవనమునకు ముఖ్యముగఁ గావలసినవి మూడు; అన్నము, వస్త్రము, జలము. ఇవియథోచితముగఁ బ్రజా సామాన్యమునకంతకును లభి యించునట్లు చేయుట రాజునకుఁ బ్రధానకర్తవ్యము, ధర్మాశోకుని రాజ్య కాలమునం దీపద్ధతిని యథావిధిగఁ బరిపాలించి నట్లాతని పవిత్రచరిత్రమునందు విస్పష్టముగఁ దెలియ వచ్చు చున్నది.

వాణిజ్యము:— అప్పటి ప్రజలసుఖము, సౌకర్యము, అభిరుచి మొదలగువాని ననుసరించి యావశక్యకములగు మార్గములు ఘట్టములు, యాన వాహనాదికములును సురక్షితముగ నెలకొల్పఁబడియుండెసు. ఆ కాలమున స్థలమార్గములును, జలమార్గములును గూడ జనుల రాకపోకలకుఁ జాల ననుకూలముగ నుండెను. కాని యా కాలమున సస్యములు,దారు పదార్థములు మొదలగు భారపదార్థము లొక దేశము నుండి మఱియొక దేశమునకుఁ దీసికొనిపోవుటవలన లాభము లేక యుండెను. ఇక్కాలమున బారిసాలు బియ్యము, సుందర వనదారువులు, రాణిగంజి నేలబొగ్గు, బర్మాకిరొసెను నూనె మొదలగునవి దేశ దేశాంతరములకుఁ బంపుటవలన లాభము లభియించుచున్నది. ఆకాలమున నట్టి పద్ధతి లేదు. అప్పటివర్తకులు స్వదేశవర్తకమునం దేమి, విదేశవ ర్తకమునం దేమి, యిట్టి వస్తువుల నుపయోగించెడు వారు గారు. అప్పటి వారుపట్టు బట్టలు, మజిలినులు, అస్త్రశస్త్రములు, సూచీశిల్ప చిత్రములగు