పుట:ASHOKUDU.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

అ శో కుఁ డు

ముగ జరపుటకుఁ దగినయుద్యోగులు నియమింపఁబడి యుండిరి. వారి మూలమునఁ గృషికులయొద్దనుండి యథోచితముగ నీటిపన్ను గ్రహింపఁబడుచుండెను. అప్పుడీ నీటిపన్నున కుదక భాగమని పేరు. ఇప్పటికంటె నా కాలమునందే సస్య క్షేత్రములు మిగుల విరివిగనుండెను. కొలఁది ప్రయత్నములతో గొలఁది భూమిని గృషి చేయుట చేత నే కృషికులగృహములు సంపన్నము లగుచుండెను. కృషి చేసిన భూమి విరివిగనున్నను పంట సరిగా లేనప్పుడు పండిన పంటలో నాఱవ పాలు మాత్రమే రాజునకుఁ బన్నుగఁ జెల్లింపవలసియుండుటవలనఁ గృషికులకును వారి పరివారమునకును గావలసినంత యాదాయము లభియించుచునే యుండెను. అందువలన నతివృష్టి, యనా వృష్టి మొదలగు నీతి బాధలు తటస్థించినప్పుడు గూడఁ బ్రజల కుఁదిడి లేక దేశములఁబట్టి పోవలసిన యవసరము లేకుండెను; అట్టి వారి సంరక్షణకొఱకు రాజు తనకోశమునుండి ధనమును వెచ్చింపవలసిన యావశ్యకమును లేకుండనుండెను. విశేషముగ ధనమున్నంత మాత్రమునఁ బ్రజలు సుఖులై యుందు రనుట కవకాశము లేదు. ఒక్కొక్కప్పుడు ధనమిచ్చినను నాహార పదార్థములు లభింపక పోవచ్చును. కావున బ్రతి గృహమునను సంవత్సరమునకుఁ జాలినన్ని యాహరపదార్థములు నిలువయుండునట్టి యేర్పాటు చేయవలసియుండును. ధర్మప్రాణుఁడును, దయామూర్తియునగు న శోక సా ర్వభౌముని రాజ్యపాలనముం దట్టి సర్వోపయోగకరం బగు