పుట:ASHOKUDU.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియాఱవ ప్రకరణము

105

కళలును గూడ నిరాఘాటముగ నున్నతిం బొందుట కవకాశము కలిగెను. అందువలనఁ బ్రజలకుఁ గూడ నౌన్నత్యము లభించెను. అశోకుని రాజ్య కాలమున దేశమునందలి కృషి, వాణిజ్యము, శిల్పము, శిక్ష మొదలగు వాని యవస్థ యెట్లుండెనో ప్రత్యేకముగ సంక్షేపముగఁ జెప్పుచున్నాము.

కృషి:— చిర కాలమునుండి భారతవర్షము కృషి ప్రధాన మైన దేశము. ఆవిరియంత్రములు, విద్యుద్యం త్రములు, దారుయంత్రములు నయోమార్గములు మొదలగునవి ప్రబలియున్న యిక్కాలమునందుఁగూడ నీ దేశము నందు నూటికి డెబ్బదిమంది కృషి జీవనులున్నారు. ఇప్పటికిఁ జాలకాలమునకుఁ బూర్వమునందీ దేశమునఁ జాలమంది కృషిమీఁద నే యాధారపడి యుండిరని నిస్సంశయముగఁ జెప్పవచ్చును. ప్రభువుల యాదాయమునందలి హానివృద్ధులు చాలవఱ కీవ్యవసాయమునుబట్టియే యుండును. కావునఁ గేవలమును రాజు కృషికోప యోగ కార్యములను జేయుట యందే జాగరూకుఁడై యుండవలయును. అశోకుడు తన రాజ్యమున వ్యవసాయమున కనుకూలముకొఱకును, సస్య క్షేత్రములఁ దడుపుటకును వలసినన్ని కాలువలను ద్రవ్వించెను. అనేక స్థలములయందలి కొండ వాగులను గట్టించి నీరు నిలవ చేయించి యనుకూలోపయోగములను గావించెను. అదను తప్పకుండఁ బొలములఁ దడుపుకొనుటకుఁగూడఁ దగిన సదుపాయముల నేర్పఱిచెను. ఈ పనులన్నియు యధాక్రమ