పుట:2015.396258.Vyasavali.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

వ్యావహారిక భాషా బహిష్కార నిరసనము 25. జైమినిభారతము, శ్రీరంగ మహాత్మ్యము, భారతము మొదలయినకొన్ని గ్రంథములకు వ్రాతప్రతులు సాహిత్య పరిషత్తువారికి దొరికినవి. అందులో జైమినిభారతముమాత్రము పరిషత్తు వారే భాషలో కూడనిమార్పులు కొన్ని చేసి, అచ్చు వేయించినారు. ఈ పౌఢవచనములలోకూడా వాటిని * వాటికి”, “ రెండోఅధ్యాయము”, ఉండే”, “ చేస్తివి”, ఈ కూతురిని? డపిలిచినా కదాం', 'రాజుకు', 'ఇరు వై' పొదలయిన వాడుక మాటలు అనేక ము గాఉన్న వి. ఇట్టివి దిద్దడము లోకాన్ని మోసపుచ్చడము కాదా? ఇవి రచించినవారు ప్రాచీనాంధ్రభాష శ్రద్దగా అభ్యసించి, ఆభాషల తమకుగల రచనాసామర్థ్యము ప్రకటించి పండితుల మెప్పు పొందగోరినవారు. వాడుక భాషలో తాము రచించిన వచనగ్రంథములవలె ఇవి అఖిలలోకోపకారక మైనవి కావని పొ రెరుగుదురు. లోకులందరికీ ఉపయోగించేటందుకు రచించినపుస్తక మహలన్నీ వాడుక భాషల నే ఉన్న వని ఋజువు చేయుటకు చాలినంతసాక్యము లిఖితపు సక భాండాగారములందే ఉన్న దిగదా! ఇంతవరకు, శాసనములు, పాటలు: యక్షగానములు, నాటకములు, కథలు, పురాణేతిహాసములు, చరిత్రలు, వ్యావహారిక భాషలో మనపూర్వులు రచించిన వే అ నేక మున్న వని నిస్సంశ యముగా ఋజువయినది గదా! ఇకను, శాస్త్రములు, కళలు అభ్యసించే. తెలుగువిద్యార్థులకు గురువులు ఎట్టిభాషలో గ్రంథములు రచించేవారో తెలియ జేస్తాను. అన్ని విద్యలలోనూ ‘ఆధ్యాత్మవి ద్యావిద్యానాం వాద. పవదతా మహమ్” అని శ్రీకృష్ణభగవానులు చెప్పినట్టు, ఆధ్యాత్మ విద్య (శ్రేష్ఠమయినది గదా. ఈవిద్యను తెలుగువారికి వాడుక మాటలతో బోధిస్తూ పండితులు, యతులు మొదలయిన జ్ఞాన సంపన్నులు రచించిన వచన గ్రంథ. మలం వందలున్నవి. ఉదా: పరిషత్తు వారివద్ద నున్న వి కొన్ని టిని పేర్కొం . టాను. మోకళా స్రము, భగవద్గీతావచనము, వాసుదేవమననము, వేదాంత,