పుట:2015.396258.Vyasavali.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

వ్యాసావళి తెలియడానికి వచనరూపంబు మార్కండేయమహాముని పొండునందనులకు చెప్పిన ప్రకారం సింగరాజుదత్తాత్రేయులు చేసుకొన్న పుణ్యకథ సంపూర్ణం” అని గ్రంథకర్తగ్రంథాంతమందు ఏ ఉద్దేశముతో ఇట్లు రచించినాడో స్పష్ట పుగా తెలియజేసినాడు. ఇట్లు రచించినరాజులచరిత్రలు భక్తులచరిత్రలు కూడాకలవు, సాహిత్య పరిషత్తువారివద్దనున్న ' రాయవాచకము, ప్రతాప చరిత్రము, కర్ణాటక రాజ్య వృత్తాంతము వ్రాతప్రతులలో ఉన్నట్టే అచ్చు పడ్డవి. గవగ్న మెంటువారి లిఖితపుస్తక భాండాగారమందు తంజావూరి రాజుల చరిత్ర, సింహళవిజయము, భాగవతచరిత్ర ఉన్న వి; మొదటిది శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు తాము రచించిన పీఠికలో అచ్చు వేయించి శారు. తెలుగు దేశముచరిత్ర విశదపర్చగల వృత్తాంతములు, అపరిమిత మగా మెకన్టీ, సెయిలర్, చౌక్ మొదలయినవారు సంపాదించినవికుప్పలకుప్పలుగా గవర్నమెంటువారి పుస్తక భాండాగారమందు « లోకల్ రికార్డు” అనే పేరితో ఉన్న వి. ఆంధ్రపత్రిక 149వ సంచిక లో 25-1-24వ తేదీని " ఓరియంటల్ లైబ్రరీ” ఆ నే శీర్షికతో క, మార్కం డేయశర్మ గారు ప్రకటించినవ్యాసము చూస్తే, ఇవి ఎంతవిలువయినవో తెలు స్తుంది. వచనరచనాసంప్రదాయము పూర్వ మిట్లుండేదని గౌమ్య(గాంథిక ఐదవ విమర్శించి తీర్పు చెప్పిన పరిషత్పండితులకు గాని యూనివర్సిటీ పండి తులకు గాని శాసననిర్మాణ సభలోని తెలుగుసభికులకుగాని విద్యాశాఖాధ్యకు. లకుగాని 1914 సం. రమునకు పూర్వము తెలియ లేదు. ఇట్టివచన గ్రంథములు వందలకొలదిగా ప్రాతప్రతులలో ఉన్న వని నేనై నొ మొదట ఎరుగను; లోకము నేటికిన్నీ ఈ సంగతి తెలిసినవారరుదు. అయితే, ఇట్టివచన గ్రంథములతోపాటు, పొండ్యచోళమండలములలో ఆంధ్రరాజుల ప్రభు త్వము సాగుచుండినప్పుడు గ్రాంథికాంధ్రమున వచనము రచించిన,