పుట:2015.396258.Vyasavali.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

వ్యాసావళి అధమపక్షము అధ్యక్షురాగా నుండేవారయి నా గ్రాంథికాంధ్రము యాదృ చ్చిక సంభాషణమందు నాడడము అలవాటు చేసుగ్గోన్నారా? వారి బహి స్కారశాసనము ప్రకటించినప్పుడే నేను రచించిన మెమోరాండములో • ఈ శాసనము చొప్పున గ్రాంథికాంధ్రము మాట్లాడ నేర నీవారిని పరిషత్తులో నుండి తొలగించవలసి ఉంటుంది; అట్లా చేస్తే ఒక్కరయినా పరిషత్తులో నిల్చి ఉంటారా?” అని అడిగి నాను. తామే అనుసరించ లేనప్పుడు తమ శాసనము లోక ములో చెల్లుతుందా? దానిని లోకులందరూ అనుసరించగల గనుకొన్నారా? ప్రకృతివిరుద్దము గా కొన్ని కుక్కలను గాడిదలను అత్యంత క కినశిక చేత సర్కసులో నేగరులు ఆడించగలిగినట్లు పరిషత్తువారు ప్రజ లందరిచేతనూ ‘గాంథిక భాష మాట్లాడించగలరా? ఓహో ! అవి వేక విలసితము ! భాష అంటే ఏమిటో ప్రజలకు భాష ఏలాగున అలవడుతుందో చిన్న ప్పటినుండిన్ని వాడుతూ ఉన్న భాష పెద్దవాళ్లకు విడిచి పెట్టడము ఎందుకు ఆసాధ్యమో లోకమం దెక్కడా చెవిని బడని భాష పుస్తకాలలో చదువుకొని నోటను స్వేచ్ఛగా ఎందుకు మాటలాడలేం, అట్టి భాష ప్రజ లందరికీ విద్య నేర్పుటకు ఎందుచేత ఉపచరించదో తెలియని వారు ఎంత గొప్పవాడై తే నేమి దేశ భాషజోలికి రాకూడదు. ఇతర విషయములలో వారికి గల గొప్పతనమూ పలుకుబడీ చూచి ప్రజలు భ్రమపడి వారి శాసనము దేశమునకు హితమయినడని నమ్మి నారు గాబోలు. అయి తే నమ్మినవారు ఎవరూ నమ్మినదానిని ఆచరించినట్టు తోచదు. పరిషత్తువారి బహిష్కార శాసనము ప్రకటిత మైన పిమ్మట నే గాంధీమహాత్ముని ఉపదేశముమూలము గా మన దేశమందు అంతటా పుట్టి దినదిన ప్రవర్ధమానమయి పట్టరాకుండా ఉన్న ఉత్సాహమువల్ల స్వాతంత్ర్యాభిలాష స్వ దేశాభిమానము స్వరాజ్యేచ్ఛ సంఘ జీవనమందు తక్కిన వ్యాపారములను వికసింపజేస్తూ ఉన్న ట్రే సకల వ్యవ హార నిర్వాహమునకు పరమసాధనమైన దేశభాషనుకూడా అనేక విధముల