పుట:2015.396258.Vyasavali.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

వ్యావహారిక భాషా బహిష్కార నిరసనము 4. లున్ను మొదట ఉండిరి. మధ్యస్థులు ఇద్దరున్ను (గామ్యనాదులతో ఏకీ భవించి శిష్టవ్యవహారమందున్న భాష (గాహ్యమ న్నారు. ఆ తీర్మా నము తమకు ప్రతికూల మవుటవల్ల గ్రాంథిక వాదులు, తమకుగల పలుకుబడి చేత మరి నలుగురు గాంథిక వాదులను ఏదో సాకు కల్పించి కమిటీలో చేర్చు కొన్నారు. అందుచేత వారి పక్షము పొరు కమిటీలో అధిక సంఖ్యాకులయి మొదటి తీర్మానము నిరర్థక మయేటట్లు చేసి నారు, | పరిషత్తు వారు చాలా ధనము కర్చు పెట్టి చాలా శ్రమపడి వ్యావ హారిక భాషాభ్యాసమువల్ల సారస్వతము నశించి దేశ సునకు ఉపద్రవము కలుగుతుందని ప్రజలను, ప్రభుత్వము వారిని, విద్యాధికారులను నమ్మించుటకై చెప్పిన మాటలన్నీ యథార్థమయినవి కావనిన్నీ దురభిమానము చేత తాము మోసపోయి లోకమును మోసపుచ్చి నారనిన్నీ ఈ వ్యాసమందు ఋజువు చేస్తాను. వ్యావహారిక భాష అపరిమిత ప్రయోజన మైనదనీ (గాంథిక భాష పరిమితప్రయోజనమై పండితలోక మునకై నొ సులభము కాదనీ సప్రమాణ ముగా నిరూపిస్తాను. వ్యావహారిక భాషాబహిష్కారము చెల్ల దనీ, గాంథిక భాష నే గ్రంథములన్నీ రచించ వలెనని నియమ మేర్పరచుటవల్ల చక్కగా దేశ భాష వృద్ధిపొందదనీ ప్రజలలో విక్య చక్కగా వ్యాపించదనీ స్పష్ట ముగా తెలియజేస్తాను, | సాహిత్య పరిషత్తు వారు వ్యావహారిక భాష నిష్ప్రయోజనమనో అన ర్ధకమనో భావించి బహిష్కరించినారు. సంభాషణలలోకూడా ఈ బహిప్కారము చెల్లవ లేన నే వారి సంకల్పమయినట్టు కనబడుతున్నది. కీర్తి శేషులయిన కొక్కొండ వెంకటరత్నము పంతులవారివలె ఇంటిలోను వీధి లోను బాజారులోను కాకపోయినా బడులలోను న్యాయస్థానములందు కార్యస్థానములందు సభలలోనయి నా గ్రాంథిక భాష నే మాట్లాడుట అ-దరు అభ్యసించవలేనన్నారు. ఈ పది సంవత్సరములలో పరిషత్పముఖు లైగా