పుట:2015.392383.Kavi-Kokila.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాంకము] సీతావనవాసము 97

                     సగముపూచిన యెఱ్ఱ లొద్దుగపురెమ్మ
                     గాలితాఁకున నేలను గూలినటులఁ
                     దూపుగంటుల నెత్తురు దొరఁగుచుండ
                     ధరణి యొడిలోనఁబవళించెఁ దపసి సుతుఁడు.

ఆహా ! నా యవివేకమునకు నాకే లజ్జ వొడముచున్నది ! ఋషి కుమారుని దునుమాడినందుకు అన్న కోపింపకమానఁడు. ఈ కుమారుని దురవస్థఁ గాంచినఁ దాపస దంపతులు నన్ను శపింపక మన్నింతురా ?

         ఉత్సాహ, చిగురుటాకు జొంపమందుఁ జిచ్చువెట్టి యవ్వలన్
                     వగలఁబొగులు మూఢునటుల బాలకున్‌మనోహరున్
                     విగతజీవుఁగా నొనర్చి వీరలోక మందు నే
                     నగడు గుడుతు నంచుఁ జిత్త మారటంబు నొందెడిన్.

ఆహా! యీతాపసబాలకునిపై నకారణవాత్సల్యము నాకేల గలుగుచున్నది ? ఇది తపోవన మహత్వమా యేమి ?

                     అరి దెగటారిన యందుకుఁ
                     బరగదు మోదంబునాదు భావమునందున్
                     బరమ సుహృన్మరణంబనఁ
                     గర ముమ్మలికంబు నన్నుఁ గళవళపెట్టున్.

ఆహా ! బాలకుని యవయవములు మెల్లమెల్లగఁ గదలుచున్నవి శరాఘాతముల నీకుమారుఁడు మైమఱచి పడియుండెనేగాని, దైవవశమున మరణింపఁడాయె. ఈ వీర కిశోరమును మా శిబిరమునకుఁ గొనిపోయి వ్రణ