పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

168 అధిక్షేప శతకములు

పచునెన్మిడవ శతాబ్దినాటి దని భావించుట కవకాశము కలదు. ఆత్మసంబుద్ధి పరముగ వ్రాసినచో గువ్వల చెన్నడే ఈ శతకకర్త అనుట కేట్టి సందేహము లేదు. గువ్వల చెన్నని కులమును గూర్చి ఆతనికి సంబంధించిన కథలనుగూర్చి కొందరు విపులముగా వ్రాసిరి. కాని ఆవి అన్నియు ఊహల పై అక్కడక్కడ ఆ నోట ఈ నోట ప్రచారముననున్న గాథల పై ఆధారపడినవి.

గువ్వల చెన్న శతక పద్యములు నూటికిమించి యున్నవి. వీనిలో కంద పద్యముల సంఖ్యయే ఆధికము. చాటుపద్య సంకలన గ్రంథములలో కొన్ని వృత్త పద్యములు కూడ ఉదాహృతములు. కందపద్యము లన్నిటియందు గువ్వల చెన్నా అను మకుటమే కలదు, ఒకదానిలో బిజనవేముల చెన్నా అని ఉన్నది. కొన్ని పద్యములకు పాఠాంతరములును కలవు. చౌడప్ప శతక పద్య పాదము లిందు కొన్ని చేరినవి. ఈ రెండును ఆత్మసంబుద్ధిపరమైన కంద పద్యశతకములు. వీనిలోని సామ్యము ననుసరించి జనుల వ్యవహారమున కొన్ని మార్పులు కూడ కలిగినవి. వీనిని కొంతవరకు పరిష్కరించి వావిళ్ళవారు 111 పద్యము లతో ఈ శతకమును ప్రకటించిరి. గువ్వలచెన్న శతకమున పద్యములు మరి కొన్ని కలవు. కొన్ని పాఠములుకూడ పరిష్కరించదగి యున్నవి,

చౌడప్ప వేమనల ససుకరించి గువ్వల చెన్న శతకకర్తకూడ సమకాలిక వ్యవస్థను సమీక్షించి రాజకీయ, మత, సాంఘిక, ఆచారవ్యవహార, ప్రకీర్ణాంగము లను గూర్చి నయమార్గమునను అధిక్షేపధోరణిలోసు తనకు తోచిన రీతిలో విమర్శించేను. కొన్ని పద్యములలో సామాన్య నీతులు, పూర్వ కవుల ధోరణిలో ప్రసిద్ధ నీతిశాస్త్రశోకానుసరణములుగ ఉపదేశాత్మక రీతిలో వచింపబడినవి. ఇండుసు కొన్ని నిజపరిశీలనకు వచ్చిన అంశములు చేర్చబడినవి. గొంగడి ప్రశస్తిని గోంగూర రుచిని చాటిన పద్యము లీ సంచర్భమున ప్రత్యేకముగ గమనింపదగినవి.

పాశ్చాత్య నాగరికత అప్పుడప్పుడే తెలుగుదేశముపై ముద్రవేసిన కొలమున చెల్లువడిన శతక మిది. మారిన వ్యవస్థను అస్తవ్యస్తమైన స్థితిగతులను