పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గువ్వలచెన్న శతకము

వేమన చౌడప్ప శతకముల ధోరణిలో రచింపబడిన శతకము లందు గువ్వల చెన్న శతక మొకటి. ఈ శతక కర్తృత్వము వివాదాస్పదముగ నున్నది. క్రీ.శ. 1828 నాటికి తమకు లభించిన ఆధారము - ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో ప్రకటితమైన వ్యాసము - ననుసరించి వంగూరి సుబ్బారావు గారు వజ్రపంజర మరున్నందన - గువ్వల చెన్న శతకములను పట్టాభిరామ కవి కృతములుగ నూహించిరి. పదునేడవ శతాబ్దినాటి అప్పకవి వజ్రపంజర శతక పద్యమును లక్ష్యముగా నుదాహరించినందున పట్టాభిరామకవి అంతకు ముందె అనగా 1800 ప్రాంతమున జీవించియుండునని సుబ్బారావుగారు భావించిరి. కాకినాడ గ్రంథాలయము పారు ఈ శతక ప్రతిని సంపూర్ణముగ ప్రకటీంప నున్నట్లు సుబ్బారావుగారు అప్పటికే వినియుండిరి. వారు శతక కవుల చరిత్రలో చాటుపద్య మణిమంజరి చాటుపద్య రత్నాకరము లందుదాహృతములైన పదునాలుగు పద్యములను మాత్రమే బరిశీలించిరి.

శతక కర్తృత్వము, కవి కాలము అను అకమును గూర్చి వంగూ3 సుబా రావు గారి అభిప్రాయము పునఃపరిశీలనార్హము. గువ్వల చెన్న శతకము పట్టాభిరామ కృతమనుటకు స్పష్టమైన ఆధారములు లేవు. శతక నామము ననుసరించి మాత్రము గువ్వల చెన్నడు ఈ శతకమును రచించినట్లు లేదా అతని పేర రచింపబడినట్లు భావించవచ్చును. ఆత్మసంబుద్ధిపరముగ వేమన ననుసరించి, ఈ కవి శతకమును రచించియుండును. గువ్వల చెన్నని ప్రసక్తి శతకమునందొకటి రెండు సండర్భములందు ప్రస్తావింపబడినది. శతక పద్యము లందు పాశ్చాత్య సంస్కృతి తత్ర్పభావము తెలుగువారి పై ముద్రవేసిన అంశము బహుళముగ గలదు ఈ ఆదారము ననుసరించి గువ్వల చెన్న శతకము