పుట:2015.372978.Andhra-Kavithva.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసొత్మకం వాళ్యం కావ్యమ్.

43


భేద మున్నది. సామాన్య ధర్మశాస్త్రమున విధులకుఁ బ్రభుత మెండుగనుండును. స్వాతంత్ర్యమున కనేకములగు నిరోధము లేర్పఱుపఁబడును. అందు మనధర్మశాస్త్రము మానవస్వాతంత్ర్య మునకు వేన వేలు నిరోధములఁ గల్పించినది. మనకు ధర్మము లన్నియు సతీతపథమునే చూపింప యత్నించుటచే ధర్మమాచ రించవలెనన్న మనము వియత్పథముననైనఁ జరింపవలెను. ధర్మము విసర్జింపవలెనన్న నధోలోక ప్రాప్తియైన నందవ లెను. మధ్యస్థమగు మార్గాంతరము కన్పింపబడ లేదు. కావ్యము లీపనికిఁ జాలఁ దోడ్పడినవి. కవి స్వతంత్రేచ్ఛఁ గలవాఁడగుటచే స్వతంత్ర పథమన నడచుటవలన వచ్చుఫలితముల నన్నింటిని యోబించి దానివిషయమై తగినకట్టుదిట్టములఁ జేసికొనుచునే యుండును. రసవిషయము సూక్ష్మ గ్రాహ్యమైనదగుట చేఁ దత్సం బంధములగు ధర్మములును గడుసూక్ష్మములుగ వర్తించును. ప్రత్యక్షానుభవమున నధర్మములుగఁ దోఁచువిషయము లెన్నో కావ్య సంబంధమైన రసదృష్టితో నవలోకించిన ధర్మములట్లు గంపడును.

సమష్టిమాను శ్రేయ మేధర్మశాస్త్ర నిరీక్షణము.  వ్యక్తి యొక్క స్వతంత్ర రస ప్రవృత్తియే కావ్య నిరీక్షణము.

ఈ భేదమునకుఁ గారణము రెండుమతములకును గల భిన్న నిరీక్షణ మేకాని వేఱుకాదు. ధర్మశాస్త్రమునకు నీరీక్షణము సంఘ శ్రేయము, మానవవ్య క్తియుఁ దత్సంపోషణమును, సాధన మాత్రములును, నప్రథానములును. కావ్యమునకో సంఘ. శ్రేయ మప్రథానవిషయము. సాధనమాత్ర మే, ప్రథానవిష