పుట:2015.372978.Andhra-Kavithva.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

ఆంధ్ర కవిత్వచరిత్రము

ప్రథమ


యమగు నాలంబము మానవవ్యక్తియొక్క రసప్రవృత్తియే. అందుచే ధర్మశాస్త్రము మానవ వ్య క్తిస్వాతంత్ర్యమునకు నిరో ధకములగు ధర్మములను సంఘ శ్రేయోభినృద్ధికై నిర్ణయించును. కావ్యమన్ననో మానవవ్యక్తికి సహజమగు ప్రవృత్తులలో నొకటియగు రసప్రవృత్తిని బెంపొందించు నుద్దేశముతో దాని కనుగుణములగు ధర్మములనే నిర్ణయించి సంఘ శ్రేయోభివృద్ధికి గొన్ని యెడల హానిఁగూర్చుధర్మములఁగూడ బోధింపఁజూచును. కావుననే "కావ్యధర్మములకును బ్రాపంచిక ధర్మములకును వైప రీత్యముండుట. ఈవి ఖేదము పాత్రలచర్యల విమర్శించుచు ధర్మాధర్మవిమర్శన చేయఁగడంగు నవసరముల ముఖ్యముగఁ బాటింపఁ దగినదై యుండును కొన్ని యెడలఁ గవులు సూతనపాత్రముల నిర్మించుచు నూతనధర్మముల సూచించెదరు. అనఁగా పాత్ర, ములచర్యలను నూతనధర్మముల ననుసరించి చేయఁబడినయట్టి హనినిఁ బ్రదర్శించి ప్రత్యక్షముగఁ గాకపోయినను పరోక్షముగ నైనను నూతనమార్గముల విశదీకరింతురు. నిస్తంద్ర, ప్రతిభాశాలురగు కవులు భావనాశ క్తిబలమున భావిపరిణామమును 'గూడఁ దాము గాంచి మనకుఁగూడ గోచరింపఁ జేయుచు విరుద్ద ధర్మములపై మనలోఁ బక్షపాత ముకయింపఁ జేతురు. ప్రతీ మనుజునకును స్వాతంత్ర్యేచ్ఛ యుండుట చేఁ గావ్యధరముల యెడ నభిమానము లోలోనఁ జెందుదుము గాని, బహిరంగ ముగ దానిని వెలిఁబుచ్చుటకు జంకుడుము. ఈభావమునే పెల్లి యను నాంగ్లేయకవివరుఁడు కవులు శాసనాధి కారహితులగు ధగ ప్రవక్తలు” అను వాక్యమునఁ దెల్పి రెండుధర్మమతముల కును గల భేదమును వివరించెను.