పుట:2015.372978.Andhra-Kavithva.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

ఆంధ్ర కవిత్వచరిత్రము

ప్రథమ


1.వచనవి భేదములు.


ఏ దేశమున నేమి, యేభాషయం దేమి వచన భేదముఁ జెప్ప వలసిన యవసరముల నేవ్వరైన "రెండు పిట్ట వచ్చినవి” అని గాని, “ఒకబల్లలు ఉన్న వి” అనిగాని, చాలమంది జనులు కూరుచున్నది” యనిగాని పల్కుదురా? పలుకరు. వేయేల? గ్రామ్యు లేని, పిల్లలేని, ఎవ్వరు నేని యట్టితప్పుఁ గావింపరు. భాషయేమి యుఁ దెలియని పరదేశీయు లట్లు పల్కుదు రేమో? సాధార ఇముగా తెనుఁగు తిన్న గారాని తురకలును, విదేశీయులగు శ్వేతజాతుల పోరును నిట్టి యుభ్యంశములఁ దఱచువాఁడుచుండుట మనకు విదితమే, కాని వ్యాకరణశాస్త్రమన నేమియో తెలియని పామరులు సైతము సహజమగు వ్యావరణజ్ఞానబల మున పచనభేదముల సూచించుపట్ల పై నుదాహరింపఁబడిన యప శ్రంశముల నుపయోగింపరు.

2 లింగవి భేదము.

ఇంక లింగవిభేద విషయముఁ బరిశీలింతము. ఎట్టిపశు ప్రాయుఁ డేని “ఆఁడువాఁడు వస్తాడు, రాముఁడు మంచిది, ఆవు మంచి వాఁడు బల్ల మంచివాడు” మొదలగు ప్రయోగ ములఁ గావించునా? కావింపఁడు. ఎవ్వఁడేని యట్టిప యోగము గావింపఁగ నే మన మెల్లరమును జేరి చెన్నపురికో, విశాఖపట్టణ మునతో కబురుఁ జేసి యతనికిఁ బిచ్చియాసుపత్రులలో నెందేని ప్రవేశము సంపాదించెదము. కాని “గుఱ్ఱముగారూ, ఆఁడ వాడు” అని పలుకు జాతీయులు భాష తెలియనివారగుట చే క్షంతవ్యులు; స్వభావసిద్ధములగు వ్యాకరణ నీయమముల కేనియు నతీతులు. ముక్కుల నూపిరిఁ గలిగి చైతన్యముఁ