పుట:2015.372978.Andhra-Kavithva.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

రసాత్మకం వాక్యం కావ్యమ్.

31


దక్కియుండని జీవు లెల్లరకు నీలింగవిభేదజ్ఞానము తల్లి పాలతో వచ్చునదియే. ఇందులకు వారి కేవైయాకరణులసాయమును నక్కరయే యుండదు.

3, పురుషవిభేదములు,

పురుష విభేదజ్ఞానము కూడ నిట్టి సహజప్రతిభయే. ఎవ్వం డుగాని “నేను వస్తావు, నీవు వస్తాను, వాడు వస్తాము” అని పల్కునా? పలుకఁడు. ఒక వేళ నట్లు పలికినచో వానినిగూడ పై నఁ బేర్కొ నఁబడిన వారితో కట్టఁగట్టి పంపుదుము. నీవు, నేను, అతఁడు, ఆమె యనువిభేదములు కన్నులున్న ప్రతిమానవునకు గోచరించును. ఆభేదము కనఁజాలని యతఁడు సాక్షా త్తు అద్వైతమూర్తియైన గాని, తనకుమించిన దెద్దియుఁ బ్రపంచ మున లేదని నమ్ము నహంకారస్వరూపుఁ డైనఁగాని, చైతన్య రహితుఁడగు జడ ప్రకృతి యైనఁగాని కావలెను.

4. కాలవి భేదములు.

తుదకు కాల విభేషజ్ఞానము కూడ జన్మ లబ్ద మేకాని యన్యము కాదు ఎట్టివాఁడును “నిన్న వస్తాము, రేపు వచ్చితిని” అనిపలుకునా! పలుకఁడు నిన్న, నేఁడు, రేపు లనుని భేదములు బిడ్డలకు సై తము గోచరించును. ఏది ముందు జరిగినదో, ఏది జరుగుచున్నదో, ఏవి ముందు జరుగఁగలదో జనులు "కాల క్రమానుసారముగ నేర్పజింపఁగలరు. నిన్నటీ సంగతి 'రేపటి దిగను, వేపటి సంగతి నిన్నటి దిగను సన్వయిం చుగుణము కాల జ్ఞానము వీడి తపోనిష్ఠ మై యుగయుగములు ముక్కు-లను గన్ను లను మూసికొని జపముఁ జేయుచుఁ జై తన్యముఁ దక్కి శిలలు