పుట:2015.372978.Andhra-Kavithva.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

291

ఆంధ్ర కవిత్వచరిత్రము

షష్ట


మఱింత దృఢపజచు చున్నది. ప్రపంచమున నన్ని జాతుల సాహిత్య చరిత్రము నందును పై సత్యమే నిర్ధారిత మగుచున్నది. సాధారణముగఁ బ్రపంచమున మానవులెల్లరు ననాగరకస్థితి నుండి నాగరకస్థితికి వచ్చుచున్నారని సిద్ధాంతము కలదు. ఆసిద్ధాంతమును బురస్కరించుకొని యనాగరకజాతుల సాహిత్యమును బరిశీలించితి మేని ఛందోబద్దములగు పాటలును పద ములును నెక్కువగఁ గన్పించుచున్నవి. అనాగరకజనులు సాధారణముగ సంస్కారమూన్యు లగుటచే నాలోచనమును తర్కమును పూర్వాపర విమర్శనమును నెక్కు-పగఁ జేయఁజాలరు. వారికి నాగరికులకుంబలె తలలు మార్చునూహలును, కొంపలుఁ దీయు తెలుపులును నరుదు; సత్యమునందు వారి కభిలాష మెండు. హత్యం జేసిన వాడు సాధారణముగఁ దన నేరమును తత్తణ మొప్పికొని దానికింగల కారణమును నిర్భయముగఁ జెప్పి న్యాయాధిపతి తీర్పునకు వెఱవథ నిర్బీక చేతస్కుఁడై ,దైవముఖముఁ జూచి, సత్యముపై నాధారపడి, కర్మఫలము నను భవింప సంసిద్ధుఁడై యుండును. ఇప్పటివా రన్ననో, చేసిన నేరముఁ గప్పిపుచ్చుటకై న్యాయవాదుల నుపయోగించి, నోటికి రాని యసత్యముల నెన్ని యేని ప్రమాణ పూర్వకముగఁ జెప్ప వెనుతీయరు. అనాగరకులకు ప్రపంచమునఁ గల యద్భుతముల యెడను విపరీతముల యెడను భక్తి మెండు. ఇందులకు దయ్యముల యందును, భూతముల యందును,శక్తుల యందును, మంత్ర, శాస్త్రముల యందును, వారికి గల భ క్తయే ప్రబలతార్కా జము. అట్టిభ క్తిని మాననవనాగరకులు.. మూఢభక్తి'యని నిర సించిన నిరసింతురుగాక! అయ్యదియే వారి పవిత్రతకును సౌశీల్యమునకును, సద్గుణసంపత్తికిని, ముఖ్య కారణమును నాట