పుట:2015.372978.Andhra-Kavithva.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

భావప్రకటనము

291


పట్టును, నని భావింపఁదగును. కన్ను లఁ జూచినదే సత్వ మనియు, దృష్టి గోచరములుగాని వన్నియు ససత్యములనియుఁ బల్కు మన నవనాగరక సిద్ధాంతులు, తమ యజ్ఞానమును దెలిసి కొనఁజూలగున్నారు, భగవంతుఁడు అనంత శక్తియుతుఁడనియు భగవచ్చక్తికి లోనుగాని విషయమును, వస్తువును, బ్రపంచమున "నేవీయును నుండఁ జూలదనియు, పరిమిత జ్ఞానులగు వీరికిం దట్టుట లేదు.

-2. షేక్స్పియరుకనియభిప్రాయము.

ఈ సందర్భమున ఆంగ్లకవి శేఖరుఁడగు షేక్స్పియరు 'హ్యామ్లెట్ నాటకమున హ్యామ్లెట్ రాకుమారునిచే నతని మిత్రుఁ డును హేతువాదియును నగు హోరేషియో యనునతనికి జెప్పించిన యీ క్రిందిపలుకుల గంభీరభావమును అపూర్వరహ స్యమును గహింతురుగాక!

.

"There are more things in heaven and earth Horatio, Than are dreamt of in your philosophy."

"హొ రేషియో, స్వర్గమర్త్యలోకముల నీతర్క సిద్ధాంత ములకుఁ గలలోనైన సంగని విశేషము లేన్ని యేనియుంగలవు. *సుమా' అని పై మాటల యర్థము. ఇట్టి ఆశ్చర్య భావముఁ గలవా రగుట చేత నే యనాగరకులు తర్క సింద్దాంతములకు వశులు గాక, భావోద్రేక పూరితులై, తమకుఁ 'దోఁచిన సంగతులను తమకుఁ దట్టిన యూహలను తము నావేశించికొనిన భావములను పద్వ రూపముననే, ఛందోబద్దములగు గానరూపనమునే వెల్లడించి, ఎన్నటికిని ఏరికిని మరువరానంత శాశ్వతమునఁ దమ కీర్తిని ప్రతిష్ఠించి సాహితీ సేవకులకఁ గృతజ్ఞ తాపాత్రు లైరి ప్రపంచమున నేచ్చటఁ జూచినను పద్యమే ముందు రచింప