పుట:2015.372978.Andhra-Kavithva.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము,

భావప్రకటనము,

285


శ్రీనాథునిచేఁ బరిహసింపఁబడిన పోతనామాత్యుఁ డొసఁగిన ప్రత్యుత్తరమును.

 ఉ. బాలరసాలసాలనవపల్ల పకోమల కావ్యకన్యకం,
గూళల కిచ్చియప్పడుపుఁగూడు భుజించుటకన్న సత్కవుల్
హాలికులైన నేమి? గహనాంతరసీమలఁ గందమూల కౌ
ద్దాలికులైననేమి? నిజదారసుతోదరపోషణార్థమై.

సత్కవిత్వసిద్ధియనఁ బరమార్థమునే లక్ష్యముగాఁ గలిగిన వారు 'బాలరసాలసాలనవపల్లవకోమల కావ్య కన్యకం, గూళల కిచ్చి యప్పడుపుఁగూడు భజింప' నొల్లక నిజదారసుతోదర పోషణార్థము హాలికులును గందమూల కౌద్దాలికులును నగు. టకుఁగూడ సంశయింపరు. ఏయవస్థయం దున్నను వారికి గావ్యపరమార్దమే లక్ష్యముగా నెప్పుడును గన్ను లఁగట్టుచుండును. నిరంతర కావ్యపరమార్థసన్నీధిని గలిగిన కవులు దూషణ భూషణతిరస్కారంబులకును, రాజసత్కారంబులకును,సంపదలకును ఆశించి కావ్య పరమార్గమును ద్యజింపనొల్లరు చూడుఁడు! భారతీసాంత్వనముఁ గావించుచుఁ బోతనామాత్యుఁడు దెల్పిన, వాక్యములు,

ఉ. కాటుకకంటినీరు చనుఁగట్టుపయింబడ నేలయేడ్చెదో
కైటభదైత్యమర్ధనుని గాదిలికోడల యోమదంబ! యో
హాటకగర్భురాణి! నీసునాఁకటికిం గొనిపోయి యల్ల క
నాట కిరాట కీచకుల కమ్మ ద్రిశుద్ధిగా నమ్ము భారతీ.

అంతియేగాక పోతన పలికిన యీవాక్యములనుగూడ గమనింపుఁడు...