పుట:2015.372978.Andhra-Kavithva.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

282

ఆంధ్ర కవిత్వచరిత్రము

షష్ట


చునా? అనునదియే విచారణీయాంశము. కవియొక్క మాన సికావస్థకును, గద్యరచయిత మానసికా వస్థకును జాల భేదము గలదు. ఆ కారణముననే పద్య స్వభావమునకును గద్వస్వభావ మునకును ఎం తేని 'భేదము కలదు. ఆ భేదమును దన్మూలకారణ మగు మానసికావవి శేషములను కొంచెము విచారింతము.

సహజకవిస్వభావలక్షణములు.

-

కవియన నెట్టివాఁడు? ప్రపంచ మాతని కనుల "కెట్లు గోచరించును? ఈ ప్రశ్నకు యుగయుగములను, తరతరములను, దత్కాలస్వభావమువల్లను, అప్పటి కవుల సంస్కారవిశేషమువల్లను, పరిణతమగు నన్వయమే సమకూర్పఁ బడుచున్నది. కొన్ని యుగములఁ గవి సర్వశాస్త్ర పారంగతుఁడగు పండితుఁడని భావించిరి. కొన్ని యుగముల సొతఁడు శాస్త్ర పరిచయము లేక సహజముగ స్వతస్సిద్ధముగ నాకసమునఁ దిరుగాడుచుఁ బుష్పశాఖల నెక్కి మధురముగ గానముచేయు ,పక్షికులము బోలెఁ గవిత్వముఁ జెప్పునని భావించుచుండిరి. మామతమునఁ గవియనఁగ సహజకవియే యగుటచే సహజకవితా ప్రేరకమగు మానసికావస్థనే వర్ణించెదను.

1, స్వాతంత్య్రము పోతనకవి.-

సహజకవికిఁ బ్రపంచము సర్వము విశుద్ధముగను అద్బు తముగను భగవన్షయ ముగను గన్పించుచునే యుండును. సహజకవి మనము వెన్నవలె మెత్తనై యుండును. సహజకవి ఆడంబర రహితుఁడై వినయ సంపన్నుఁడై నిజమనోరథము నందే లక్ష్యము గలవాఁడై యుండును. చూడుఁడు. 'హాలికులా' యని