పుట:2015.372978.Andhra-Kavithva.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము,

భావ ప్రకటనము.

273


యగుచుండును. అని షేక్స్పియరు పలికిన పలుకులయం దెంత సత్యము కలదు? భావసాక్షాత్కారమును, శబ్దసిద్ధియును, నిట నభిన్నములై, యభేదములై, యవినాభావసంబంధము కల వియై యేకార్థ ప్రతిపాదకములై, బ్రహ నంద జనకములై యిట్టి నిరలంకృతధ్వని ప్రధానసహజ మధురపద్యములు జన్మించుట కవకాశము నొసఁగుచున్నవి.

సారాంశము.


కావున శైలియొక్క, సౌందర్యమును పోషించునది యలంకారములుగాక సౌక్షాత్కారబల మనియు, సట్టి సాక్షాత్కారబలముఁ గలిగిన వారికి క్రి యాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకర ణైః” అన్నట్లుగ నలం కారములును, రీతులును, వృత్తు లును ననవసరములనియు, నట్టి సాక్షాత్కా రము లేనివా రెన్ని యలం కారములఁ గూర్చి వ్రాసినను వారి కవిత యెరువుసొమ్ములు పెట్టుకొన్న 'పేరంటాలువోలే, గంతలబొంతలఁ దగిలించికొన్న గంగి టెద్దునో లె, సకలభూషణాలంకృతమైన రాతిబొమ్మవోలె, హాస్యాస్పదముగను, రసాభాసకరముగను, నిర్జీవముగను మాత్ర మే యుండును. శైలియొక్క స్వభావమును నడిపించెడునది కవియొక్క చిత్తవృత్తియుఁ, జిత్తసంస్కారమును, రసభావమును, సాక్షాత్కారమును, శబ్దసిద్దియు నేగాని, వట్టి పై పై మెఱుఁగులగు నుపమోత్ప్రేక్షాద్య లంకారములు కావనియు, రసమే, కవియొక్క ప్రతిభయే, శైలిపై సధికారు లనియుఁ దిరిగి యొకమాఱు పాఠకులకు హెచ్చరించి యీ ప్రశంసను ముగించుచున్నాను.

ఆంధ్ర కవిత్వ-18