పుట:2015.372978.Andhra-Kavithva.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

274

ఆంధ్ర కవిత్వచరిత్రము

షష్ణ


2.చందోవిషయములు

కావ్యము రసాత్మకము. రసము భావానుభూతియే. భావములు శబ్దసూచితంబులు. శబ్దము లక్షరసముదాయములు. అశురములలో ప్రతి దానికిని నాదము, ధ్వని కలదు. కావున తర్కరీత్యా, నాదము నొసఁగు నశురముల కలయిక యగుటచే శబ్దమునకును నాదము కలదు. శబ్దముల సముదాయమే భావ మగుట చేత శబ్దములకు ధ్వని యుండుటవలన శబ్దసముదాయ మగు భావమునకును ధ్వని కలదు. భావమే రసమగుట చేతను, రసమే కావ్యమగుట చేతను రసమునకును రసముద్వా రా కావ్య మునకును నాసము, ధ్వనియు నుండి తీఱును, అక్షరములను, అర్థములను, భావములను నాశ్రయించినచగుట చే నీనాదము శుద్దసంగీత నాదమంత నిశితముగ నుండడు. కాని, యంతకన్న నెక్కుడు విచిత్ర విశాల వ్యాప్తి గలదిగను, వైవిధ్యము గలదిగను నుండును.

కావ్యమునకుఁ బద్య మవసరమా?

ఈఅక్షర, భావార్థముల నాశ్రయించికొనిన నాదము యొక్క గతియే, నడకయే ఛందస్సు. ఈచంధస్సుయొక్క నియమబద్దస్వరూపమే పద్యము. కావునఁ బద్యమును ఛంద స్సును కావ్యమున సవసరములని చెప్పకతప్పదు. ఈఛందస్సు నియమ సహితమా? అట్లైన సనీయమము లేట్లు కల్పింపఁబడినవి? ఆనియమము లవసరముగ నసుష్ఠింపఁదగినవా! అట్టి నియమముల తత్త్వమును పరమార్గమును సెట్టిది? ఛందోనియమములు పరిమిత సంఖ్యాకములా? . ఆను ప్రశ్నల నీసందర్భమున విచారింప పలేను. ఒక్కొక ప్రశ్నమున కెంతయైన వ్యాప్తి యున్నది.