పుట:2015.372978.Andhra-Kavithva.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము,

భావ ప్రకటనము.

275

కాన సమాధానముల నూరక సూచిం చెదను, ఛంపస్సు నియ మసహితమనియు, నాదము నియమసహితము కానిచో గందర గోళముగ నుండుననియు, సృష్టి యంతయు నియతికృతనియమ బద్దమయినట్లే ఛందస్సుఁగూడ నియమబద్దమై యుండుననియు, నట్టి ఛందములు ప్రస్తార భేదముల సనుసరించి యనంతములుగ నుండుననియు సంస్కృత లాక్షణికుల మతను. ఇందులకుఁ దార్కాణముగ వాల్మీకివదనమునుండి శోకము ఛందోబద్ద మగు నసుష్టుప్ శ్లోకరూపమున నప్రయత్నముగ వెలువడే ననియు, నట్టి యనుష్టుప్ ఛందముయొక్క ప్రస్తారము లేయనం తములగు ఛందము లగుననియుఁ జెప్పుదురు. కానీ వారిలోనే కొందఱు ఛందోబద్దముగ నున్నను, లేకపోయినను సరే, రసాత్మకముగ నున్న గద్యయైనను సరే కావ్యమగుననియుఁ, గవిత్వము గద్య కవిత్వము పద్యకవిత్వము సని ద్వివిధములుగ నుంట చే కావ్యమునకు పద్యము ముఖ్యమును నవసరమును కాదనియు రసము మాత్రమే ముఖ్యమనియుఁ జెప్పుచున్నారు.

పాశ్చాత్య విమర్శకుల మతము, వాట్సుడంటర్ 1 పండితుని సిద్ధాంతములు.


పాశ్చాత్య విమర్శకులలో నీ ఛందోవిషయమగు చర్చ చాలమంది చేఁ జేయఁబడినది. ఆరిష్టాటిల్, వర్డ్సుపర్తు మొన లగువారు పద్యము శావ్యమునకు ముఖ్యము కాననియు, అలంకౌరమాత్రమే యనియు వాదించిరి. జాన్సన్ కాలరెడ్డి, షెల్లీ, వాట్సుడంటన్, సెయింట్సుబరీ మొదలగు వాకు పద్యము ముఖ్యమనియుఁ గావ్యమునకు ప్రత్యేకవై లక్షుణ్యము నాపా దించు గుణములలో పద్యమును ఛందస్సును ప్రధానములును