పుట:2015.372978.Andhra-Kavithva.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము.

భావప్రకటనము.

263



నెన్నేని యీయవచ్చును, గ్రంథవిస్తరభీతిచే స్థాలీపులాకన్యా యమునే ,యనుసరించితిని. కావున మితముగను, నౌచిత్య మున కనుగుణముగను, వాడిన శబ్దాలంకారములును నర్థాలం కారములును గూడ సమానముగ రసమునకు దోహద మొన గూర్పఁగలవు. మితమును, నౌచిత్యమును గుర్తెఱుఁగక పిచ్చిగా వాడిన రెండును రోత జనింపఁ జేసియే తీఱును. కావున శబ్దాలంకారముల విషయమున మనవా రీయన్యా యముఁ గావించుట తప్పని నావిజ్ఞప్తి, వెనుకటి కొక యమ్మ “అల్లునితలకు నెయ్యి లేదు, అల్లునితో వచ్చినయతని తలకు నూనెయు లే”దనఁగఁ జమత్కారియగు నాయల్లుని స్నేహి తుఁ డాపెను "ఆమ్మా, ఆరునెలలనుండి యుబ్బసమురోగము తోఁ జచ్చిపోవుచున్నాను. లేదనుకాడికి నాకును నెయ్యియే లే దనవమ్మా" అని బ్రతిమాలి పరిహసిం చెనఁట, ఆపరిహాస మును రసీకు లీ సందర్భమున యథోచితముగ నన్వయించికొందు రుగాక. '

ధ్వనివిషయము,

“అనలంకృతీ పునః క్వా పి"అను మమ్మటుని పల్కుల నాధారముగఁ గొని కావ్యము లేయలం కారములు లేకున్నను సహజసౌందర్యముపల్లను, భావభరమువల్లను, రసబంధు రత్వమువల్లను నింపు నింపుననియు సోదాహరణముగ సిద్ధాంతముఁ జేయవచ్చును. అనలంకృతములై, శాకుంతలము లోని శ్లోకచతుష్టయము, భవభూతియొక్క, కరుణరస ప్రధాన ములగు శ్లోకములును, తిక్కనయొక్క రసబంధురపద్యసహ ప్రంబులును రసికుల చిత్తముల రంజింపఁ జేయుట లేదే? ఉదా