పుట:2015.372978.Andhra-Kavithva.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

264

ఆంధ్ర కవిత్వచరిత్రము

షష్ట

హరణముల సాహితీపరిచయులే వెదకికొందురుగాక, ఇంక ధ్వనివిషయము కొంచెము సూచించెదను.

రాజుగారి పెద్దభార్య పతివ్రత యనఁగ నే రాజుగారి చిన్న భార్య లంజ యను నర్థ మెట్లు స్ఫురించుచున్నదో ఆతీరే ధ్వని యందురు. అనఁగా మాటలవలన ప్రత్యేకముగఁ జెప్పల బడక పోయినను వానిచే సూక్ష్మముగ సూచింపఁబడు భావమే ధ్వని యగుచున్నది. ఎట్లన మనము రాజుగారి చిన్న భార్య లంజయని ప్రత్యేకించి చెప్పకపోయినను అట్టియర్ధము స్ఫురించు చునేయున్నది. ఉదహరణము కొంచెము మోటుగ నున్నను భావమును సులభముగను, గొట్టవచ్చినంత ప్రత్యక్షముగను దెల్పున దగుటచే గ్రహింపబడినది. పాఠకులు మన్నింతురు గాక. ఈధ్వనికి వ్యంజన యను నామాంతరముగూడ వ్యవహారమున నున్నది.

- ధ్వని త్రివిధము ౧. శబ్దధ్వని

ఇట్టిధ్వని త్రివిధము. శబ్దధ్వని, అర్థధ్వని, భావధ్వని యని శబ్దమువలన నే అనఁగా శబ్దముల కూర్పువలననే వాని యొక్క నాదమువల్ల నే యర్థము స్ఫురించిన చో నయ్యది శబ్దధ్వని యనఁబరఁగును. చూడుఁడు. పెద్దన మనుచరిత్రలోని హిమవత్పర్వతవర్ణనమున,. . .

చ. అట జని కాంచె భూమిసురుఁ డంబరచుంబి శిరస్సరజరీ
పటల ముహుర్తుహుర్లుఠ దభంగ తరంగమృదంగ నిస్వన
స్ఫుటనటనాను రూపపరిఫుల్ల కలాపికలా పజాలమున్
గటకచరత్క రేణుకరకంపితసాలము శీతశైలమున్.”

అనుపద్యమున' "అంబరచుంబి శిరస్సరజరీపటల ముహుర్ముకు TOP