పుట:2015.372978.Andhra-Kavithva.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

262

ఆంధ్ర కవిత్వచరిత్రము

షష్ట

పన్ను లనఁదగు రామకర్ణామృత-కృష్ణకర్ణామృత గీతగోవింద భాగవత కావ్యముల నుండియుఁదుదకు భారతమునుండియుఁ గూడ నెన్నేని యుదాహరణములఁ జూపింప వచ్చును. చూడుఁడు! గజేంద్ర, మోక్షణమున గజేంద్రుని మొఱ నాలకించి భక్తునిఁ గాచుటకై యేరికిం జెప్పక యేఁగు శ్రీవిష్ణుమూర్తిని గాంచి లక్ష్మీ దేవి,

 “అడిగెద నని కడుపడిఁ జను
నడిగిన దను మగుడ నుడువఁ డని నడయుడుఁగు౯
వెడవెడ జిడిముడి తడఁబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడల౯."

అని పోతన వర్ణించిన పద్యపు నడకయందునను, యమకమను. శబ్దాలంకారమువలనను శ్రీలక్ష్మీ దేవి యొక్క మనస్సులోని, తత్తరమును, నలజడియు, సౌందోళనమును, నింక నితరము లగు భావములును నెట్లు సందడించుచున్నవో! ఏదీ ఈపద్య, భావమును మార్చి యాశబ్దాలంకారము దీనివైచి యద్దాని భావమును పూర్తిగ వేఱుపదములఁ జెప్పి మెప్పింపుఁడు. భారతమున సభిమన్యుని మృతి కై జాలిఁ జెందుచు సర్జునుఁడు,

ఉ. హాయను ధర్మ రాజతనయా యను నన్నెడఁబాయ నీకుఁ ;
న్నేయనుఁ దల్లి నేపఁజను నే యనుఁ గృష్ణుఁడు వీఁడె వచ్చె రా
వే యను నొంటిబోవఁ దగవే యను నేగతిఁ బోవువాఁడ 'నే
నోయభిమన్యుండాయనుఁ బ్రియోక్తుల నుత్తరం దేర్పవేయనున్.

అని విలాపించిన పద్యమునందలి శబ్దాలంఠారము 'వెగటుపుట్టిం చుచున్న దా? సంస్కృత భ క్తిగీతములనుండి యుదాహరణములు