పుట:2015.372978.Andhra-Kavithva.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

252

ఆంధ్ర కవిత్వచరిత్రము

షష్ట

-

శైలి కవియొక్క ప్రత్యేకస్వభావమును సూచించును

అట్టి స్వభావము ప్రతి మనుష్యునుకును ప్రత్యేకముగా నుండును. ఎవ్వని స్వభావము వానిదే, ఒకని స్వభావము 'పూర్ణముగ నింకొకని స్వభావమును బోలియుండదు. ప్రతి మనుష్యుని స్వభావమునుకును బ్రత్యేకమగువ్య క్తియు, విల క్షణమును, స్వరూపమమును నుండును. అట్టి విలతుణత్వమును, ప్రత్యేక వ్యక్తిని, ప్రత్యేక స్వరూపమును శైలి యెట్లు చూపింపఁ గలదు? శైలి యనఁగాఁ బదజాలమును బదముల కూర్పును నని యిదివరకు దెల్పితిమి. అట్టిపదములలో బ్రతిదియు నే దేనొక యర్థము నొసఁగుననియు, "నే దేనొక భావమునకు సంజ్ఞారూపముగ నుండుననియు, నాభావముయొక్క ప్రత్యేక స్వరూపమును బ్రదర్శించుననియు నిదివర కే దెల్పితిమి. భావ ముల సముదాయమే స్వభావమయినప్పుడు భావములయొక్క సంజ్ఞా రూపమును భాహ్యస్వరూపమును ననఁదగు పదముల కూర్పు(శైలి) భావములయొక్క సముదాయమగు స్వభావము నెట్లు సూచింపకుండును? సూచించియే తీరునని యెఱుంగునది. అట్టి స్వభావమును సూచించుటలో శైలి స్వభావముయొక్క “సర్వములను లక్షణములను, విలక్షణములను, ప్రత్యేకత్వమును, సర్వమును పూర్ణముగ వ్యక్తములఁ గావించును. అందుకనియే శైలి స్వభావసూచక మని తెల్పుట. మానవుని స్వభావము యొక్క వాగ్రూపమే శైలి. మానవుని స్వభావము ఏమనుష్యున శామనుష్యునకుఁ బ్రత్యేకముగ నుండునుగాన తద్వా గ్రూప మగు శైలియుఁ దత్ ప్రత్యేకత్వమును జూపించును. అందు