పుట:2015.372978.Andhra-Kavithva.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము

భావ ప్రకటనము,

258

కనియే ఆంగ్లేయ విమర్శకులు "The style is the man" అని, పల్కుట, (శైలియే మనుష్యుఁడని పైమాటల భావము.)

ఒక నిశైలిని, వ్రాయ నింకొకనికి సాధ్యముకాదు.

శైలి మానవుని ప్రత్యేకస్వభావమును సూచించునది యగుటచే నొకని శైలి యింకోకనికి రాదు. ఇంకొకని శైలిలో వ్రాయవలెననిన నాతఁడై పుట్టి, యాతని భావముల నను భవించి, యాభావములఁ బ్రత్యేక స్వరూపమగు శైలిలో వ్రాయ వలెనుగాని వేఱువిధమునఁ గాదు. తిక్కనవలె వ్రాయవలె నన్నను, కాళిదాసునిపలె వ్రాయవ లెనన్నను, షేక్స్పియరువలె వ్రాయవ లెనన్న ను, తిక్కనయవతారమునుగాని, కాళిదాసు సవతారమునుగాని, షేక్స్పియరు నవతారమునుగాని, తాల్చి వ్రాయవలెను. వెనుకటికి, పులినిజూచి నక్క వాఁతఁచెట్టు కొనిన నక్క, పులి యయ్యేనా? కాలేదు. ఒడలుమాత్ర మే కాలెను, నక్క పులి కొవలెనన్న పులియొక్క బలము, శౌర్యము, పౌరుషము మొదలగు పులిలక్షణము లన్ని యు నలవడవలయు నేగాని చారలు కనుపించున ట్లొడలు కాల్చుకొన్నంతమాత్ర ముననే నక్క పులి యగునా? అట్లే తిక్కనయొక్క పదముల కూర్పుల నేవో కొన్నింటిని, కాళిదాసుని యుపమల నేవో కొన్నింటిని 'షేక్స్పియరుయొక్క మాటల నేవోకొన్నింటిని దొంగిలించి కానీ యనుకరించినంతమాత్రమున నెవ్వఁడై నను తిక్కనగాని, కాళిదాసుగాని, షేక్స్పియరుగాని యగునా?' క్కాడు. అట్టిపోని వ్రాతలయందుఁ దిక్కనశైలిగాని, కాళిదా సుని శైలిగాని, షేక్స్పియరుని శైలిగాని కనుపింపదు. ఇంకఁ గనుపించున దేమి? అట్టి వ్రాతకాని యజ్ఞతయు, బుద్ధిహీన