పుట:2015.372978.Andhra-Kavithva.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము

. భావప్రకటనము,

251

నని యూహింతుము. ఇట్లే సాధారణముగ వివిధముఖలక్షణ ములఁబట్టి మానవుని మనోభావముల నెఱుంగు శాస్త్రము కూడఁ గలదు. దాని నింగ్లీషు భాషయందు *Physiognomy" యందురు. అట్లే భావములవలసను మనుజుని స్వభావము బయల్పడు చుండును. చెడుస్వభావముఁ గలవాఁ డెప్పుడును. చెడు తలంపులను తలంచుచుఁ, జెడుకోరికలఁ గోరుచుఁ, జెడు. మాటల మాటలాడుచునే యుండును. కొందఱు పైకి నొక తీరునఁ గన్పడుచు లోపల నొక తీరుగ నుండుచుఁ బయోముఖ విషకుంభములు బోలియుందు రదియు గొంతవజుకు సత్యమే. అందుకనియే Physiognomy అను ముఖపరీక్షా శాస్త్రమునకు సంపూర్ణమగు ప్రామాణ్యము లేదు. కాని భావముల విషయ: మన్ననో అట్లు కాదు. ఏలనన మానవుఁడు భావముల సను, భవింపకుండ నొక్క నిముసమైన నుండఁజాలఁడు, ఎప్పుడును. 'నేదోయొక భావ మతని నా వేశించియే యుండును. నిద్ర.. పోవునప్పుడుఁగూడ నతని భావములు స్వప్న రూపముగ నతని నావేశించి యుండుననియుఁ గూడ కొందటి సిద్ధాంతము. జూగ్ర ద వస్థయందున్న ప్రతిమనుజుఁడును భావములకు వశుఁడై యుండును. భావములకును మానవుని మనస్సునకును సభిన్న అవినా భావసంబంధము కలదు. భావముల ననుభవింపని మన స్సుండదు. మనస్సు చే ననుభూతములు కానట్టి భావము లుండఁ. జాలవు. ఈభావము లన్నియు నేటి యొకరీతిని గలసి మెలసి. వర్తించు చుండినచో సదియే స్వభావ మగుసు.