పుట:2015.372978.Andhra-Kavithva.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర కవిత్వచరిత్రము

షష్ఠ

246


వడుటకుఁ బూర్వమే యమరకోశ, ఆంధ్రనామ సంగ్రహాది. నిఘంటువులను గ్రుడ్డిపాఠముగ వల్లె వేయుటయే. ఈ నిఘంటుల యందుఁ బదములచే సూచితములగు ప్రత్యే కార్థముల విషయము మఱుఁగుపరచి నిఘంటుకారులు ఒక్కొక్క యర్థము సకు ననేక పదముల సంజ్ఞా రూపకములుగఁ బేర్కొనినారు. ఆ నిఘంటువుల గుడ్డిపాఠముఁ గావించువారు భాషా రహస్య మును గ్రహింపలేక యొకయర్థము నే పలుమాట లీయఁగలవని భ్రమసి యొకమాట కింకొకటి పర్యాయపదములుగ నుండఁ గలదనియు నోకమాటకు బదులు నిఘంటువునఁ బర్యాయపద ములుగఁ జేర్కొనఁబడిన మాటలలో దేనినైనను నుపయో గించినఁ దప్పు లేదనియు, నందువలన నర్థము భేదింపదనియుఁ దప్పఁదలఁచుచున్నారు. ఒక్క స్త్రీయను 'సరమునకుఁ బర్యాయ పదములుగ మనవా 'రెన్ని పదములను వాడుట లేదు. ఈ పర్యాయపదముల ఘోష శ్రషణకఠోరముగఁ బరిణమించు చున్న ది. ఒక్కొక్క యర్థమున కే పలుమాటల వాడుటవలన నాయర్థము యొక్క సొంపు చెడుటయేకాక యాపర్యాయపద ముల కుండు ప్రత్యే కార్థమునకుఁగూడ నా భాసత్వము గలుగు చున్నది. కావున భాష యనఁగా అర్థద్యోతకశబ్దసముదాయమని గ్రహించునది. పైన నొకవస్తువునకును వేవొకవస్తువునకును. సంపూర్ణమగు రూఢసొమ్యమును, పూర్తయైన పోలికయు సుండుట యసంభవమనియు, నేవ స్తువురూప మావస్తువున, కెట్లు ప్రత్యేకముగ నుండునో, అట్లేయేమాట యొక్క ప్రత్యే కార్థ మామాటకే యుండుననియు, ' రెండుమాటలకు నర్థము